100% అటెండెన్స్.. సైకిలే సిగ్నెఫికెన్స్
- NVS PRASAD
- Feb 13
- 1 min read
పార్లమెంట్ వరకు తొక్కింది 60 కి.మీ.
15 రోజుల్లో 19,832 కి.మీ. విమానయానం
రైలు, కారు వదలని కలిశెట్టి

న్యూఢల్లీి: హైదరాబాద్‌లో ఉన్న అభి అంతర్వేదిలో జరుగుతున్న హారిక పెళ్లికి వెళ్లిడానికి ఎన్ని పాట్లు పడ్డాడో మన్మధుడు సినిమా క్లైమాక్స్‌లో యువసామ్రాట్ నాగార్జునను పెట్టి డైరెక్టర్ విజయభాస్కర్ చేయించిన ప్రయాణం గుర్తుందా..? లేదూ అంటే ఒకసారి చూడండి. కుదరకపోతే ఈ కథనం చదవండి.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢల్లీిలో పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇటువంటి ప్రయాణాలే చేశారు. ఎప్పుడు ఢల్లీిలో ఉన్నారో, ఎప్పుడు రణస్థలం గల్లీలోకొచ్చారో తెలియదు కానీ, పార్లమెంట్‌లో మాత్రం వంద శాతం అటెండెన్స్ నమోదు చేసుకున్నారు. సమావేశాలకు నిత్యం సైకిల్‌పై వెళ్లే అప్పలనాయుడు వెస్ట్రన్ కోర్టు నుంచి పార్లమెంట్‌కు ఈ సెషన్స్‌లో 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. 19,832 కిలోమీటర్లు విమానంలో ప్రయాణించారు. 1920 కిలోమీటర్లు కారులో, 200 కిలోమీటర్లు రైలులో ప్రయాణించి ఢల్లీికి, విజయనగరానికి వయా విజయవాడ`హైదరాబాద్ మీదుగా బడ్జెట్ సమావేశాలకు శతశాతం హాజరుకాగలిగారు. గురువారంతో బడ్జెట్ సమావేశాల మొదటి విడత పూర్తయింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఢల్లీికే పరిమితమైపోతే స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడతారని భావించిన అప్పలనాయుడు ఢల్లీి నుంచి విశాఖ కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయనగరం కావచ్చు, రాజమండ్రి కావచ్చు.. ఈ 15 రోజులూ ఉదయం ఒకచోట, మధ్యాహ్నం ఒకచోట, సాయంత్రం ఒకచోట కనిపించారు. ఇందులో శుభకార్యాలు, పరామర్శలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఉండొచ్చు. కానీ ఆ సందర్భంగానైనా కార్యకర్తలు, స్థానికులను కలుసుకునే అవకాశం, వారి నుంచి ఢల్లీిలో చేయాల్సిన పనులు తెలుసుకోవడం కోసం అప్పలనాయుడు ప్రజల మధ్యే ఉండాలని నిర్ణయించుకోవడం వల్ల ఈ ప్రయాణాలు తప్పడంలేనట్టు కనిపిస్తుంది. అప్పలనాయుడు ఆంధ్రా ఎంపీ అని ఢల్లీిలో ఇప్పటికే రాజకీయ అధికార వర్గాలకు తెలిసిపోయింది. ఏ ఎంపీ సెగ్మెంట్ అనేదాని మీద కొందరికి క్లారిటీ లేకపోయినా సైకిల్ ఎంపీ అంటే అప్పలనాయుడును ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. వాస్తవానికి కొత్త పార్లమెంట్‌లోకి సైకిల్‌తో అప్పలనాయుడు రావడాన్ని సెక్యూరిటీ సిబ్బంది మొదట్లో అడ్డుకున్నారు. ఇప్పుడు ఇదే అప్పలనాయుడు పసుపు సైకిల్ ఒకరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కారు పక్కన, మరో రోజు కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా కారు పక్కన, ఇంకోసారి స్వయంగా పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేసినప్పుడు ప్రధాని వేసిన శిలాఫలకం వద్ద కనిపిస్తుంది. మొదటిసారిగా ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్రమంత్రి పదవి తెచ్చుకున్న ఎర్రన్నాయుడంటే ఆంధ్రా, ఆంధ్రా అంటే నాయుడు అని ఢల్లీిలో చెప్పుకున్నట్టే ఇప్పుడు తెలుగుదేశమంటే అప్పలనాయుడు, అప్పలనాయుడంటే సైకిలన్న పేరు ఢల్లీిలో వినిపిస్తోంది.
Comments