top of page

అంకురించని యువశక్తి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 8
  • 2 min read

యువకుల మేధస్సును, వారి శక్తియుక్తులను మన పథకాలతో అనుసంధానం చేయకుండా పురో గతి ఎలా సాధ్యం? దేశీయ పెట్టుబడిదారులు అంకుర సంస్థలను, యువ మేధావులను ప్రోత్సాహించ కుండా విదేశీ కార్పొరేటు భాగస్వామ్యానికి అర్రులు చాస్తున్న పరిస్థితుల్లో యువకులు విదేశాల వైపు చూస్తున్నారు. మంచి లాభాలు వస్తాయని భావించే సంస్థలను విదేశీ పెట్టుబడిదారులు గుర్తించి, ఆర్ధిక తోడ్పాటు పేరుతో వాటిని ఆకర్షించి ‘ఆదుకుని’ ఆనక వాటిని తమ హస్తగతం చేసుకుంటున్నారు. ఈ తరహా విదేశీ దోపిడీని తరిమి వేయకుండా ఎంత బాధ పడినా ఏం ప్రయోజనం? కనీసం చైనా సాగిస్తున్న స్వతంత్ర అభివృద్ధి పంథాను మనమూ అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రభుత్వం తాను కోరుకుంటున్న ఉన్నత సాంకేతిక సంస్థల ప్రారంభానికి తగిన వాతావరణం కల్పించాలి. వనరు లు, ఆర్థిక సహాయం అందించటంపై దృష్టి సారిస్తే మేలు జరుగుతుంది. ప్రభుత్వ నినాదాలు నాద స్వరంలా వీనుల విందుగా ఉన్నా ఆచరణలో ఎందుకు వెనుకబడి ఏన్నామనేది అసలు ప్రశ్న. దేశీయ పెట్టుబడులు ఎందుకు రావటం లేదో ప్రభుత్వం తెలుసుకోవాలి. విదేశీ కంపెనీలు వీటి పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారో తెలియాలి. గతంలో ప్రధాన మంత్రిగా వ్యవహరించిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి ‘జై జవాన్‌, జైకిసాన్‌’ అని నినదించారు. దానికి వాజ్‌పేయి హయాంలో ‘జై విజ్ఞాన్‌’ అని కలిపారు. ప్రస్తుత ప్రధాని మోదీ దాన్ని మరింత విస్తరించి ‘జై అనుసంధాన్‌’ అంటున్నారంటే శాస్త్ర పరిశోధనను మరిం తగా అభివృద్ధి చేయాలని అర్థం. కానీ ఆ దిశగా తగిన కార్యాచరణే లోపిస్తోంది. ఫలితంగా రూ.25 లక్షలు, రూ.50 లక్షల చిన్న మొత్తాలకు కూడా భారతీయ యువ మేధావులు తమ అద్భుత మేధో ఆవి ష్కరణలను విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఎంత త్వరగా మారితే మన దేశానికి అంత మంచిది. మనదేశంలో స్టెమ్‌ (సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్‌మెటిక్స్‌) పట్టభద్రులు చాలా ఎక్కువ. వేలాది యువత ఏటా డిగ్రీలు చేత బట్టుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. కానీ వారి చదువులకు, నైపుణ్యాలకు తగిన పని కల్పించలేకపోతున్నారు. ఫలితంగా వారు ఉపాధి పేరుతో స్వీగ్గి, జొమాటో వంటి సంస్థలకు సేవకులుగా మారిపోతున్నారు. ఈ దుస్థితి చాలా దయనీయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతరం కోసం మరింత పూనికతో కృషి చేయాలి. కానీ పెట్టు బడి రుణాలు కూడా సరిగ్గా, సమయానికి అందక, ప్రభుత్వంలోని బ్యూరోక్రటిక్‌ పద్ధతులు, అవినీతి, బాధ్యతారాహిత్యంతో విసిగిపోయిన యువకులు నిర్వేదంతో, నిరుత్సాహంతో వేరే గత్యంతరం లేక తమ పరిశోధనా ఫలితాలను, ఆవిష్కరణలను విదేశీ పెట్టుబడిదారులకు అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. దేశప్రగతిలో యువ మేధస్సును భాగస్వామ్యం చేయాలి. సెమీ కండక్టర్లు, కృత్రిమ మేథో రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి స్వయం పోషకత్వం సాధించాలి. ఆత్మ నిర్భరతతో భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా కంప్యూటర్‌ చిప్స్‌, ఏఐ మోడల్స్‌ తయారీ చేపట్టాలి. రాబోయే తరాల అవ సరాలకు అనుగుణంగా రోబోటిక్స్‌ రంగాన్ని అభివృద్ధి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచం లోని ఏ మూలకైనా వస్తువులను చేరవేయగలిగే సప్లై చైన్లు, హై స్పీడు రవాణా సౌకర్యాలు అభివృద్ధి పరచటంతోపాటు ప్రపంచ వాణిజ్యాన్ని నిర్దేశించే స్థాయిలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. స్పేస్‌ టెక్నాలజీ, బుల్లెట్‌ ట్రైన్లు, ఇంధన రంగాల్లో సాంకేతిక కృషితోపాటు భారీగా మౌలిక వసతులు పెంచాలి. యువతను నిర్వీర్యం చేసే బెట్టింగ్‌, జూదం లాంటి యాప్‌లను నియం త్రించి యువశక్తిని ఉత్పత్తి రంగంలోకి మళ్లించి ప్రగతిరథ చక్రాన్ని పరుగులు పెట్టించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తిస్తే మంచిది. అభివృద్ధిలో మనపక్కనున్న చైనా దూసుకుపోతుండటానికి ఇటువంటి చర్యలే దోహదం చేస్తున్నాయి. ఫలితంగా ఎలక్ట్రిక్‌, బ్యాటరీ, రవాణా వాహన తయారీ , సెమీ కండ క్టర్‌, తదితర రంగాల్లో చైనా అమెరికా తదితర దేశాలకు ధీటుగా ఎదుగుతోంది. ఈ విషయంలో చైనాను మన పాలకులు స్ఫూర్తిగా తీసుకుంటే మేలు జరుగుతుంది. ఈ పరిస్థితిపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘మనం యువకుల్ని ఫుడ్‌ డెలివరీ బాయ్‌లుగా మార్చుతుంటే, చైనావారు సెమీకండక్టర్లు, కృత్రిమ మేథ రంగాల్లో వారిని తీర్చిదిద్దు తున్నారు’ అని వ్యాఖ్యానించడం వాస్తవ చిత్రాన్ని అంగీకరించడమే. భారత, చైనా దేశాల్లోని అంకుర సంస్థల పనితీరును పోల్చి చూస్తూ తగిన మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని మంత్రి చెప్పకనే చెప్పారు. కానీ వాటిని ఆచరణలో పెట్టడమే ముఖ్యం.

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page