top of page

అందరూ యోధులే.. అందరిదీ స్వార్థమే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 24
  • 2 min read

ఈ యోధుల్లో మన తెలుగు వీరుడు ఒక్కడూ లేకపోవడం మన సిగ్గు అనిపించకపోవచ్చేమోగానీ.. వారినే ప్రతినిధులుగా పెట్టుకున్న మనం మటుకు సిగ్గుపడాల్సిన విషయం. జరిగిన సభ హిందీ భాషను దొడ్డిదారిన బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నాలకు వ్యతిరేకత వ్యక్తం చేయడానికి.. అలాగే నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికగా జరిపి జనసాంద్రత తక్కువ కలిగిన దక్షిణాది రాష్ట్రాలకు గుండు కొట్టేసి జన రద్దీ ఎక్కువ కలిగిన ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఏర్పాటు చేసుకుని తద్వారా రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యాన్ని మన మీద చెలాయించాలని చూస్తున్న ప్రస్తుత మోదీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల అధినాయకులు, ప్రతిపక్ష నాయకులు కలిసి చర్చించడా నికి, తగిన కార్యాచరణను రూపొందించడానికి ఏర్పాటు చేసుకున్న సమావేశం అది. దానికి మన రాష్ట్రం నుంచి జన బలం కలిగిన నాయకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, 40 శాతం ఓటింగ్‌ కలిగిన జగన్మోహన్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌.. ఎవరికి వారు ఏవేవో సాకులతో ఆ సభకు గైర్హా జరు కావటం చూస్తే ఆహా తెలుగు వీరులు ఎంతటి యోధులో కదా! అని అనిపిస్తుంది. విషయం రాష్ట్రానికి రాబోయే కాలంలో తీవ్రమైన నష్టాన్ని చేకూర్చేదని తెలుసు. ప్రభుత్వాలను ఏర్పరచడానికి, ప్రధాన మంత్రులను నియమించడానికి చక్రాలు తిప్పి జాతీయ స్థాయిలో గొప్ప శక్తిగా విధులు నిర్వర్తిం చానని చెప్పుకొనే చంద్రబాబునాయుడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతల సదస్సులో కచ్చితం గా అందరికంటే ఎక్కువ నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉండేవారు. కాకపోతే ఆయనవన్నీ స్వప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు తప్ప నిజమైన రాష్ట్ర ప్రయోజనం ఆయనకు ప్రధానం కాదనేది ఇలాంటి చర్యల వల్ల సుస్పష్టమవుతుంది. ఫెయిర్‌ వెదర్‌లో అందరూ వీరులే. వాలీత కొట్టడానికి గజ ఈతగాడు అక్కర్లేదు. తెలుగోళ్ల కోసమే తెలుగుదేశం పుట్టింది, తెలుగు ఆత్మాభిమానమే తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆశయం అనే నినాదాలు ఎంత డొల్లగా మారిపోయాయో సరిగ్గా ఇలాంటి పరీక్షా సమయాల్లో తేలిపో తుంది. ఇక పవన్‌కళ్యాణ్‌ సరే సరి.. ఆయన మోదీ భక్తుడు. పైగా తన అన్నయ్యకు రాజకీయ శిష్యుడు. సదరు అన్నయ్య మోదీకి పరమ భక్తుడు. పైగా ఆయనకున్న సనాతన బంధాల వల్ల ప్రస్తుతం స్వేచ్ఛగా ఉండే అవకాశాలు లేవు. తన ఆసక్తతను కప్పిపెట్టుకోవడానికి త్రిభాష సూత్రమంటే మనపైకి హిందీని రద్దడం కాదనే వక్రభాష్యాలు వింటే విస్మయం కలుగుతుంది. అదే నిజమైతే ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది భాషలను మూడో భాషగా ఎందుకు అమలు చేయడంలేదో కూడా చెప్పాలి. హిందీని రాజభాషగా ఎందుకు ప్రచారం చేస్తున్నారో కూడా చెప్పాలి. చంద్రబాబునాయుడు అధికార ఎన్డీయే కూటమిలో ఉన్న ప్పటికీ దక్షిణాది నేతల మీటింగ్‌కు వెళ్లి తాను ఈ విషయాలన్నీ మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తానని ఉంటే చాలా హుందాగా ఉండేది. అయితే అక్కడికి వెళితే మోదీ ఎక్కడ ఈడీకి పని చెప్తాడేమోననే భయంతో ఇంచుమించు వణికిపోయారు తండ్రీకొడుకులు, వాళ్ల కూటమి భాగస్వామి కూడా. ఇక వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి విషయానికి వస్తే ఆయన భక్తులు భయంకర మైన ఫొటోలు తీసేస్తున్నారు. సమర్ధించడంలో అవసరం వచ్చినప్పుడు సమర్ధించవచ్చు, కానీ మరీ ఇంత నిస్సిగ్గుగా ఆత్మను చంపేసుకుని సమర్ధించనక్కర్లేదు. జగన్మోహన్‌ రెడ్డి మోదీతో అసలు ఎప్పుడూ జత కట్టలేదట. ఎవరొద్దన్నారు ఆయనతో పోతే? ఇక్కడుండి మిగిల్చింది ఏంటట? మోదీ తలపెట్టిన ఆర్టికల్‌ 370 రద్దు, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, రైతు చట్టాల ఏర్పాటు.. ఇలా ఏ ఒక్కదానికైనా ఆయన ఎదురు చెప్పడం జరిగిందా? కారణాలు మనకు తెలియనివా? ఇంకెందుకు పనికిరాని సమర్థింపులు? అభిమానం వేరు.. బానిసత్వం వేరు. చెన్నై సమావేశానికి జగన్‌ వెళ్లకపోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. దాన్ని దాచిపెట్టి సమర్ధించడమెందుకో? ఆంధ్రకు చెందిన వారిగా తెలంగాణ బిల్లును పెట్టినప్పుడు ఇక్కడ కాంగ్రెస్‌ జట్టు మేమంతా సోనియాగాంధీని వ్యతిరేకించలేదా? ప్రాంతాల సమస్య వచ్చినప్పుడు నాయ కుడి మీద ఉండే పనికిమాలిన అభిమానం దేనికి? ఎందుకీ అనవసర సమర్ధింపులు? అయినా ఇక్కడ ఆ ముగ్గురు నాయకుల తప్పు లేదు. తప్పేమైనా ఉంటే అది వాళ్లు మాత్రమే నాయకులని భావిస్తూ తల కెత్తుకుంటున్న ఈ నిర్భాగ్య జనానిది. జనంలో ఇంత బానిసత్వం, ఇంత జడత్వం ఉండి నాయకుడి కోసం కొంప, గోడు అన్ని వదిలేసి వాళ్ల వెనక పోతామనే బానిస కొడుకులతో నిండిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్రమే అసలైన నిర్భాగ్యురాలు. నిజానికి ఆంధ్ర ప్రజానీకమే దరిద్రులు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page