top of page

అవినీతి సర్వాంతర్యామి..!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Feb 20
  • 2 min read

అవినీతి ప్లేగ్‌ వ్యాధికంటే భయంకరంగా వ్యాపిస్తోంది. అది దేశంలోని అన్ని అంగాలకు సోకింది. ఇప్పుడది ప్రభుత్వాన్నే శాసిస్తోంది. అది చెప్పినట్టుగా పాలకులు తలలూపాల్సి వస్తోంది. తమ గురువులకు కావాల్సిన పనిని అవినీతి భూతం చేయించిపెడుతోంది. తాజాగా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ విడు దల చేసిన 2024 అవినీతి భావన సూచిక కూడా ఇదే రుజువు చేసింది. అవినీతిలో భారతదేశం 180 దేశాలతో పోలిస్తే 96వ స్థానంలో ఉంది. దేశంలో అవినీతి ర్యాంక్‌ 1995 సంవత్సరం నుంచి 2024 వరకూ సగటున 78.03గా ఉంది. అది 2024లో గరిష్ట స్థాయికి.. అంటే 96.00కి చేరింది. 1995లో ఈ ర్యాంక్‌ 35.00గా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయుల ప్రభ వెలిగిపోతున్నదనీ, విశ్వగురుగా అవతరించిందనీ సుప్రభాత గీతాలతో మేల్కొంటున్నాం. అవినీతిని, నల్లధనాన్ని తరిమికొట్ట డమే లక్ష్యంగా మోదీజీ మహత్తర విజయాలు సాధించారని ఒకవైపు కీర్తిస్తుంటే.. ఈ సూచిక వివరణ భిన్నంగా ఉంది. అసలు అవినీతిపై ఇంతగా సమరం చేస్తున్నాను గనకే తనను ప్రత్యర్థులు వేటాడుతున్నా రనీ ఆయన చేసిన భావోద్యేగ ప్రకటనలతో భజనపరులు బాధపడిపోతుంటారు. అవినీతిని అరికడతాం.. పూర్తిగా రూపుమాపుతాం అని మోదీ 2014లో చెప్పినా, ఇప్పుడు మాట్లాడుతున్నా అసలు ఆపింది లేనే లేదు. ఇంతచేస్తే పై స్థాయిలో అవినీతిని ఎందుకు అరికట్టలేకపోతున్నారంటే సమాధానం ఉండదు. ఒక వేళ తమకు రాజకీయంగా ఇబ్బందులు వచ్చినప్పుడు, అవినీతికి ప్రజలు వ్యతిరేకంగా తిరగబడుతున్న సమ యంలో రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేసి తప్పుకుంటారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ఇలానే జనాన్ని రోడ్లపై నెట్టేసి అవినీతిపరులకు ఏ రకంగా ద్వారాలు తెరిచింది చూశాం. అవినీతిని అడ్డుకోవడం ప్రసుత్త పాలకులకు ఇష్టం లేదు. మరింత పెంచి పోషిస్తూ రాజకీయ పబ్బానికి వాడుకోవడమే బీజేపీ ప్రభు త్వానికి కావాల్సింది. అవినీతి, కార్పొరేట్లు, మతం ఈ మూడిరటితోనే దేశ రాజకీయాలను, ప్రభుత్వాన్ని, రాష్ట్రాలను మోదీ ప్రభుత్వం శాసిస్తోంది. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అస్మదీయులకు ప్రజాసంపదను దోచిపెట్టడంలో గత ప్రభుత్వాల కంటే బీజేపీ ప్రభుత్వం మించిపోయింది. తమకు మేలు చేసిన వారి అవి నీతి కుంభకోణాలు బయటపడినా వారికి అండగా నిలబడిరది. వందలు, వేల కోట్ల రూపాయల కుంభ కోణాలు బయటకొచ్చినా విజయమాల్యా, నీరవ్‌మోదీ లాంటి దొంగలను దగ్గరుండి దేశం దాటించింది. బీజేపీ నేతలు ప్రభుత్వ రంగాలను పూర్తిగా అనిల్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ వంటి పెద్ద పెద్ద పెట్టుబడిదా రులకు దగ్గరుండి దోచిపెడుతున్నారు. అనేక చోట్ల అవినీతి జరిగిందని తేలినా చర్యల్లేవు. అవినీతికి దూరంగా ఉండాలని మోదీ చెబుతారు. కానీ తమ హయాంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల గురించి మాత్రం పెదవి విప్పరు. ఎన్నికల బాండ్ల రూపంలో కార్పొరేట్ల నుంచి అత్యధికంగా విరాళాలు పొందింది బీజేపీనే. ఆ విషయంలో మరే పార్టీ దరిదాపుల్లోకి లేదు. ఆ డబ్బు అంతా అవినీతికరమైనదే. ఆ డబ్బుతోనే ప్రతిపక్షపార్టీల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను పడకొట్టడం చేసింది. ఎన్నికల బాండ్లను వ్యతిరేకించిన ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమే. విరాళాలు అందించిన కార్పొరేట్‌ సంస్థ లకు మోదీ లబ్ధి చేకూర్చారు. రైతుల రుణాలు మాఫీ చేయడానికి చట్టం వర్తించదు. అదే కార్పొరేట్లు నష్ట పోతే వారి బ్యాంకు రుణాలను ఒక్క కలం పోటుతో రద్దు చేశారు. విమానాల కుంభకోణం, బొగ్గు, విద్యుత్‌ అవినీతి.. ఇలా ఎన్ని బయటపడినా మోదీ పాలనలో అవినీతి సర్వసాధారణం అయింది. అంతర్జాతీయం గా మోదీ ఆప్తుడైన అదానీ అవినీతి భాగోతం అమెరికాలో బయటపడినా ఆయన పరివారం పెదవి మెదప లేదు. పైగా ఆయనపై కేసు లేకుండా చేయడం కోసం అమెరికా అధ్యక్షుడిని ప్రభావితం చేసి ఆ దేశంలోని విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం అమలును నిలిపివేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ట్రంప్‌ కూడా పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కావడంతో అదానీ అవినీతి పై మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రత్యర్థుల మీద ఏ చిన్న ఆరోపణలు వచ్చినా ఈడీ, సీబీఐ వంటి ప్రభుత్వ సంస్థలను ప్రయోగించి మోదీ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోంది చూస్తూనే ఉన్నాం. అవినీతి విషయంలో సీరియస్‌గా లేకుంటే, దేశాభివృద్ధిని దెబ్బతీయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల క్షీణత, అస్థిరత, మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమవుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. స్వచ్ఛ మైన పాలన, అవినీతి రహితమైన పాలన అని గొప్పలు చెప్పుకోవడం తప్ప పేరుకుపోయిన అవినీతిని అరి కట్టకపోగా కార్పొరేట్ల అనుబంధంతో మరింత అవినీతికి ఆస్కారం ఇస్తున్న ప్రభుత్వంగా మనముందు నిల బడిరది. పెరుగుతున్న

దేశాభివృద్ధికి ఆటంకంగా మారింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page