top of page

ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్లు అరెస్ట్‌

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jan 10
  • 1 min read
  • నిందితులపై కేడీ షీట్లు

  • ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి




(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్లను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. 4.90 లక్షల విలువ గల ఏడున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడిరచారు. కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన చైన్‌స్నాచింగ్‌ కేసులో ఒడిశాలోని బరంపురానికి చెందిన సుజిత్‌ కుమార్‌ పాడి, బాలకృష్ణ సాహు పట్టుబడినట్టు తెలిపారు. నిందితులను విచారించగా, సదరు నిందితులకు కొత్తూరు, మందస, ఎచ్చెర్ల, కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరం చేసినట్టు గుర్తించినట్టు తెలిపారు. వీరిద్దరూ అనేక కేసుల్లో శిక్షలు పడడం, జిల్లాలో జరిగిన చోరీ కేసుల్లో నిందితులుగా ఉండడం వల్ల వీరిపై కేడీ షీటు తెరవనున్నట్టు తెలిపారు. నిందితుడు సుజిత్‌ కుమార్‌ పాడి పదో తరగతి వరకు చదివి మానేశాడని, భార్య, పిల్లలతో కలిసి ఆయన్ను విడిచి వెళ్లిపోయిందన్నారు. బరంపురం గొడవల్లో అరెస్టయి జైలులో ఉండగా బాలకృష్ణ సాహుతో పాడికి జైలులోనే పరిచయమైందని, ఇద్దరూ ఒడిశాలోని బరంపురం, పర్లాకిమిడి, కాశీనగర్‌, గురండి తదితర ఏరియాల్లో ఒంటరి మహిళలే టార్గెట్‌గా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతూ వచ్చారని తెలిపారు. కొన్నాళ్లు అరెస్టయి జైల్లో ఉన్నారని తెలిపారు. 2016 నుంచి 2024 వరకు జిల్లాలో మొత్తం 32 కేసులు నమోదయ్యాయని, అందులో కంచిలి, మందస, బారువ, నందిగాం కేసుల్లో శిక్ష పడిరదన్నారు. కోటబొమ్మాళి పీఎస్‌ కేసులో జైలు నుంచి విడుదలైన అనంతరం 6 నెలలు పర్లాకిమిడి జైలులో ఉన్నారన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్తూరు, మందస, ఎచ్చెర్ల, కోటబొమ్మాళి కేసుల్లో నేరాలు చేసినట్టు తెలిపారు. గురువారం సాయంత్రం మెట్టూరు జంక్షన్‌ వద్ద కొత్తూరు పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా మోటార్‌ సైకిల్‌తో పట్టుబడినట్టు తెలిపారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడంలో క్రియాశీలకంగా సందర్భంగా పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, కొత్తూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చింతాడ ప్రసాద్‌, కొత్తూరు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎండీ అమీర్‌ అలీ, కానిస్టేబుల్‌ శివప్రసాద్‌, పి.ప్రసన్న కుమార్‌, ఎస్‌.సంపత్‌కుమార్‌, హోంగార్డ్‌ సాంత్రో సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page