ఈ చట్టం వక్ఫ్ రక్షణకా.. భక్షణకా?
- DV RAMANA
- Apr 17
- 2 min read

ప్రస్తుతం దేశంలో మత ఉద్రిక్తతలకు, తీవ్ర చర్చకు కారణమవుతున్న అంశం కేంద్ర ప్రభు త్వం కొత్తగా చేసిన వక్ఫ్ సవరణ చట్టం`2025. పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదంతో ఇటీవలే అమల్లోకి వచ్చిన ఈ చట్టంపై పశ్చిమ బెంగాల్, మరికొన్ని రాష్ట్రాల్లో నిరసనలు, ఘర్షణలు చెల రేగుతుంటే.. మరోవైపు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏకంగా 72 పిటిషిన్లు దాఖల య్యాయి. వీటిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపి, తీర్పు ఇవ్వడానికి సద్ధమైంది. అసలు వక్ఫ్ అంటే ఏమిటి? ప్రస్తుత వివాదాలకు కారణమేమిటి?? ఒకసారి పరిశీలిద్దాం. ముస్లింలు తమ మతానికో, మసీదుకో ఆస్తిని దానంగా ఇవ్వటాన్ని ఉర్దూలో వక్ఫ్ అంటారు. ఇలా సంక్రమిం చిన ఆస్తిని వేరొకరికి అమ్మటానికి గానీ, బహుమతిగా ఇవ్వటానికి గానీ వీల్లేదు. వీటి మీద వచ్చే ఆదాయంతో మసీదులు, స్కూళ్లు, ఆస్పత్రులు వంటివి కట్టుకోవచ్చు, ఆ మతానికి చెందిన పేద విద్యార్థులను చదివించటం వంటి పనులకు కూడా వాడుకోవచ్చు. మన దేశంలో ఢల్లీి సుల్తానుల కాలం (1206 సంవత్సరం) నుంచీ వక్ఫ్ ఉంది. అప్పటి నుంచి దాతలు దానంగా ఇవ్వటం వల్ల దేశంలో ఆ మత సంస్థలకు చాలా ఆస్తులు సమకూరాయి. వాటి పర్యవేక్షణకు మొదటిసారిగా 1913లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ముస్లిం పెద్దలు వీటిలో సభ్యులుగా ఉంటూ వక్ఫ్ ఆస్తులను, వాటి ఆదాయాన్ని పరి రక్షిస్తూ.. ఆదాయాన్ని ఖర్చు చేసే విషయంలో తగిన సలహాలు ఇవ్వాలని నిర్దేశిస్తూ ఒక చట్టం చేసింది. అప్పటి నుంచి స్వాతంత్య్రానంతరం కూడా దశాబ్దాలుగా అమలైన ఈ చట్టంలో పలు మార్పులు చేస్తూ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో చేసిన చట్టమే ద వక్ఫ్ యాక్ట్`1995. ఈ చట్టం ప్రకారం దేశం మొత్తానికి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల్లోని వక్ఫ్ ఆస్తులను ఆ బోర్డులో రిజిస్టర్ చేయించాలని తద్వారా ఒక సెంట్రల్ రికార్డు నిర్వహించేలా ఆ చట్టంలో నిర్దే శించారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు, ఇతర అవసరాలకు దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు వివాదాలను పరిష్కరించే అధికారాలను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారు. అయితే కాలక్రమంలో ప్రభుత్వాలు ఈ బోర్డులను రాజకీయ పునరావాసానికి వాడుకోవటం ప్రారంభించాయి. ఫలితంగా అవినీతి పెరిగింది. వక్ఫ్ ఆస్తులను కాపాడటం పోయి సొంతానికి వాడుకోవటం మొదలైంది. చివ రికి ప్రభుత్వాలే వక్ఫ్ భూములను ఆక్రమించసాగాయి. ఆ ప్రభుత్వాలే నియమించిన వక్ఫ్ బోర్డు లు దానికి ఎదురు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్తులు ఉన్నప్పటికీ వాటిపై ఆదాయం సరిగ్గా రావటం లేదని, ముస్లింల అభివృద్ధికి ఉపయోగపడటం లేదని, అందువల్ల వక్ఫ్ బోర్డుల్లో కొన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని 2006లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నియమించిన సచార్ కమిటీ సూచించింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న ఆ మత పెద్దలు కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఆధారం చేసుకునే ఇప్పుడు మోదీ సర్కారు కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకొ చ్చింది. అయితే ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయంటూ ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లిం మతస్తులు కాని వారిని కూడా తప్పనిసరిగా నియమించాలి. ఒక మతానికి చెందిన బోర్డులో ఇతర మతస్తులు ఉండాల్సిందేనని చట్టం చేయడం సరైనదేనా? అలా చేయాలనుకుంటే అన్ని మతాల బోర్డుల్లోనూ ఇతర మతస్తు లకు చోటు కల్పించేలా చట్టం చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇక రెండో మార్పు ఏమి టంటే.. ప్రస్తుతం వక్ఫ్ కింద ఉన్న ఆస్తులకు సరైన పత్రాలు సమర్పించి అవి వక్ఫ్ అని నిరూ పించాలి లేకపోతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఒక తరం కిందట మనకు సంక్ర మించిన ఆస్తులకే సరైన పత్రాలు ఉండవు. అంతెందుకు మనం కొన్న భూమి మనకే చెందు తుందా అనే పరిస్థితులు ఉన్న దేశంలో ఎప్పుడో వందల ఏళ్ల క్రితం దానం ఇచ్చిన భూములు తమవేనని నిరూపించుకోకపోతే ప్రభుత్వం తీసుకుంటుందనడం న్యాయమా? ఇలాగా దేశంలో ప్రతి మత సంస్థ పరిధిలో ఉన్న భూములకు ఇదే చట్టం చేసి ప్రభుత్వం ఆ భూములను తీసుకుం టామంటే ఆయా మతాలవారు అంగీకరిస్తారా? బ్రిటీష్ వారు కూడా చేయని పలు క్రూరమైన అంశాలు వక్ఫ్ చట్టంలో ఉన్నాయి. వీటిని తక్షణం రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
Comentários