ఈ వెయిటింగ్ దేనికోసం అమ్మడు..?
- Guest Writer
- Apr 4
- 3 min read

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మెప్పించిన బ్యూటీ మృణాల్ ఠాకూర్ అంతకుముందు బాలీవుడ్ సీరియల్స్‌తోపాటు సినిమాలు కూడా చేసినా రాని క్రేజ్ అమ్మడికి సీతారామంతో వచ్చింది. సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రల్లో మృణాల్ అదరగొట్టేసింది. టాలీవుడ్‌కి మరో స్టార్ హీరోయిన్ వచ్చిందని అందరు ఫిక్స్ అయ్యారు. సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న సినిమా చేసింది అమ్మడు. ఆ సినిమాలో కూడా తన నటనతో ఇంప్రెస్ చేసింది. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మృణాల్ అదరగొట్టగా ఇక టాలీవుడ్‌లో అమ్మడికి తిరుగులేదని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీస్టార్ సినిమా డిజప్పాయింట్ చేసింది. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల మృణాల్ కెరీర్ రిస్క్‌లో పడిరది. రెండు హిట్లు పడినప్పుడు కాదు ఒక్క ఫ్లాప్ పడగానే బ్యాడ్ లక్ వెంటాడుతుంది. అందుకే తెలుగులో అమ్మడికి చేతిదాకా వచ్చిన సినిమాలు చేజారిపోయాయి. పోనీ బాలీవుడ్‌లో ఏమైనా వరుస ఆఫర్లు ఉన్నాయా అంటే అక్కడ అరకొర అవకాశాలే తప్ప పెద్దగా ఛాన్స్ లు రావట్లేదు. ఐతే తెలుగులో కొన్ని ఆఫర్లు వస్తున్నా కూడా మృణాల్ వాటిని వెయిటింగ్‌లో పెట్టినట్టు తెలుస్తుంది. మరి కెరీర్ అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా ఈ వెయిటింగ్‌లు గట్రా దేనికన్నది అర్థం కావట్లేదు. ఐతే ఒక ఆఫర్‌కి ఓకే చెప్పాక దానికంటే బెటర్ ఆఫర్ వస్తే కష్టం కదా అని మృణాల్ భావిస్తుంది.
ఐతే అలా వెయిట్ చేస్తూ ఆఫర్లను హోల్డ్‌లో పెడుతూ వస్తే ఇక ఉన్న ఆ ఒక్క ఛాన్స్ కూడా చేజారే అవకాశం ఉంటుంది. కథల విషయంలో నచ్చక వెయిట్ చేయడం మంచి విధానమే కానీ మరీ మృణాల్ ఠాకూర్ ఇలా రెండు హిట్లు ఒక ఫ్లాప్ పడగానే డీలా పడిపోవడం ఆమె ఫ్యాన్స్‌ని కన్ ఫ్యూజ్ చేస్తుంది. మృణాల్ మళ్లీ తిరిగి తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు. ఐతే సినిమాల పరంగా దూరంగా ఉంటున్నా అమ్మడు ఫోటో షూట్స్‌తో ఆడియన్స్‌కు రెగ్యులర్‌గా టచ్ లోనే ఉంటుంది. తప్పకుండా మృణాల్‌కి మళ్లీ మంచి అవకాశాలు రావాలని ఆమెని ఇష్టపడే ఆడియన్స్ కోరుతున్నారు.
తుపాకి.కామ్ సౌజన్యంతో...
హెబ్బా చేసిన తప్పేంటబ్బా!

కుమారి 21ఎఫ్’ సినిమాతో యూత్ లో సెన్సేషన్ గా మారింది హెబ్బా పటేల్. బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి కుర్రకారుని క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ సినిమాతో హెబ్బా కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ హెబ్బా ప్రయాణం అంత సక్సెస్ ఫుల్ గా జరగలేదు. హెబ్బా ఇండస్ట్రీలో వచ్చిన పదేళ్ళు అయిపొయింది. మరి ఈ పదేళ్ళలో ఆమె కెరీర్ అనుకున్నంత రీచ్ కి చేరుకుందా? ఇదే ప్రశ్న హెబ్బాని అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ’’సినిమా జర్నీపట్ల ఆనందంగానే వుంది. ఈ జర్నీని ఆస్వాదించాను. అయితే కొన్ని తప్పులు చేశాను. వాటి నుంచి నేర్చుకున్నాను. అలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాను’ అని చెప్పింది హెబ్బా. ‘అలా ఎలా’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది హెబ్బా. అది మంచి సినిమానే. తర్వాత కుమారితో సెన్సేషన్ గా మారింది. సుకుమార్ బ్రాండ్ తో వచ్చిన ఆ సినిమా టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఆ తర్వాత కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ ఆడో రకం ఈడో రకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్ 24 కిసెస్స్.. ఈ సినిమాలన్నీ ఆమెకు ఎంత మాత్రం హెల్ప్ కాకపోగా కెరీర్ ని వెనక్కి లాగేశాయి. బహుసా కెరీర్ పరంగా ఆమె చేసిన రాంగ్ సెలెక్షన్స్ ఇవే కావచ్చు. అన్నట్టు.. ఓదెల 2లో ఒక కీలక పాత్ర చేస్తోంది హెబ్బా. గతంలో ఓదెలలో ఆమెదే లీడ్ రోల్. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తమన్నాతో కలసి నటించింది. ఏప్రిల్ 17న ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుందని నమ్మకంగా చెబుతోంది.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
బామ్మర్దికి ఎన్టీఆర్ సలహా!

ఈరోజు హైదరాబాద్‌లో మ్యాడ్`2’ సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ రావడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఈ చిత్ర హీరో నితిన్ నార్ని ఎన్టీఆర్‌కు స్వయానా బామ్మర్ది. అంటే.. బామ్మర్ది కోసం బావ వస్తున్నాడన్నమాట. మరోటి.. నాగవంశీతో ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధం. నాగవంశీ-ఎన్టీఆర్ మధ్య ఉన్న ఎఫెక్షన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగవంశీ ఎప్పుడూ ఎన్టీఆర్ పేరు జపిస్తూనే ఉంటాడు. త్వరలో ఎన్టీఆర్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ వేడుకలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక రద్దయిన దగ్గర్నుంచి ఎన్టీఆర్‌ని ఏ సినిమా వేడుకలోనూ చూళ్లేకపోయారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు వాళ్లకు ఓ అవకాశం దక్కినట్టైంది.
నార్ని నితిన్‌కు ఇది వరుసగా మూడో విజయం. మ్యాడ్ 1, ఆయ్, మ్యాడ్ 2.. ఇలా హ్యాట్రిక్ విజయాల్ని అందుకొన్నారు నితిన్. ఇక మీదట కూడా జాగ్రత్తగా కథలు ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు ఎన్టీఆర్ సలహాలూ తోడవుతున్నాయి. ఎన్టీఆర్ నితిన్‌కి ఓ సలహా ఇచ్చార్ట. ఇక మీదట కూడా రొమాంటిక్ ఎంటర్‌టైనర్లు చేయమని చెప్పార్ట. నితిన్ కూడా అదే ఫాలో అవుతున్నట్టు టాక్. ఈ రోజుల్లో ఓ హిట్ పడగానే, హీరోలంతా యాక్షన్, మాస్ కథలవైపు చూస్తున్నారు. నితిన్ మాత్రం లవ్ స్టోరీలపై ఫోకస్ పెడుతున్నాడు. ఇది మంచి ఆలోచనే. ఇటీవలే ఓ లవ్ స్టోరీకి నితిన్ ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది. తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
Comments