top of page

కంగ్రాట్స్‌..! మీరు పూర్‌ టు రిచ్‌ అయ్యారు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Mar 18
  • 4 min read
  • ముగిసిన పీ-4 సర్వే

  • మూడొంతుల ఇళ్లకు వెళ్లని సిబ్బంది

  • 20 శాతం మించని పేదలు

  • నిధుల సమీకరణకు ప్రభుత్వం పాట్లు

  • అప్పు దొరకని చోట తప్పని జిమ్మిక్కులు

  • సంక్షేమ పథకాలకు వర్తింపజేయకుంటే మేలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పూర్‌ టు రిచ్‌.. దరిద్రం నుంచి ధనవంతుడిగా మార్చడం. ఇది 2024 ఎన్నికల సమయంలో కూటమి తరఫున చంద్రబాబునాయుడు తెర మీదకు తెచ్చిన నినాదం. అంటే ప్రస్తుతం బీదలుగా ఉన్న తమ స్థితిగతులను మార్చి ధనవంతుల సరసున చంద్రబాబు చేరుస్తారని చాలామంది భావించివుంటారు. అసలు ఈ స్లోగన్‌ పట్టించుకోకుండానే జగన్మోహన్‌రెడ్డి మీద విరక్తితో ఓటేసినవారే ఎక్కువ మంది ఉన్నారు. ఆ విషయం పక్కనపెడితే పూర్‌ టు రిచ్‌ నినాదంలో పేదవాడ్ని ధనికుడ్ని చేయడమే. కానీ చంద్రబాబు రాజకీయాలు ఆర్థికవేత్తలకు తప్ప ఆకలితో ఉన్నవాడికి అర్థంకావు. ప్రస్తుతం దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారని చూపిస్తున్నవారెవరూ దరిద్రులు కారని, వారు కూడా సంపాదనపరులేనని నిరూపించే పనిలో పడిరది ప్రభుత్వం. ఇప్పటి వరకు రోజుకు రూ.600 నుంచి రూ.700 కూలీ తెచ్చుకుంటున్నవారిని దినసరి కూలీ కింద లెక్క కట్టాం మనం. అదే ఇంటిలో ఇద్దరు కూలికి వెళ్తే.. దాదాపు రూ.50 వేలు నెలకు సంపాదిస్తున్నారని, అటువంటప్పుడు వారు బీదలు ఎలా అవుతారన్నది ప్రభుత్వం దగ్గరున్న ప్రశ్న. అలాగే నెలకు రూ.4వేలు పింఛను తీసుకుంటున్న వ్యక్తి ఇంతవరకు నిస్సహాయుడి కింద పరిగణించాం. కానీ నెలకు రూ.4వేలు వస్తుంటే సంపాదనపరుడేకాని సంపాదన లేనివాడెలా అవుతాడని ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న. ఇక ఏసీలు, మోటారువాహనాలు ఉన్నవారు ఎప్పుడో ధనికుల కింద నమోదైపోయారు. ఆ తర్వాత ఇప్పుడు విద్యుత్‌ వాడకాన్ని బట్టి, ఇంటి పైకప్పును బట్టి కూడా పేద, ధనికులను నిర్ణయించే పనిలో పడిరది ప్రభుత్వం. తన జీవితంలో ఇంత టైట్‌ పొజిషన్‌ ఎప్పుడూ చూడలేదని, అప్పులు పుట్టక, పథకాలు ఇవ్వలేక సతమతమవుతున్నానంటూ ఒకటికి పదిసార్లు చెబుతున్న చంద్రబాబు ఒకవైపు అమరావతి నిర్మాణం, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు, దీనికి తోడు సంక్షేమ పథకాలు అమలుచేయాలంటే తమ రాష్ట్రం బీద రాష్ట్రం కాదని, సొమ్ములున్నాయని ప్రపంచ బ్యాంకుకు చెప్పాలి. ఈ భూమ్మీద ఎక్కడైనా డబ్బున్నోడికే అప్పు పుడుతుంది. తీర్చగలిగే సత్తా ఉన్నోడికే బ్యాంకులు రుణాలిస్తాయి. ఈ సూత్రం యూనివర్సిటీ స్థాయిలోనే చదువుకున్నారు కాబట్టి చంద్రబాబునాయుడు తన రాష్ట్రంలో కేవలం 20 శాతం మందే పేదలున్నారని, భూగోళంలో ఎక్కడైనా ఇంతకంటే తక్కువుండరని చెప్పడం కోసం ఒక సర్వేను ప్రారంభించారు. అది ఎప్పుడు మొదలైందో తెలీదుకానీ, మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఇందులో యంత్రాంగం కొందరి ఇంటికి వెళ్లి సర్వే చేసిన మాట వాస్తవం. కానీ అధిక శాతం కార్యాలయాల్లో కూర్చునే మమ అనిపించేశారు. ఎందుకంటే.. జగన్మోహన్‌రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థ వద్ద ప్రతీ ఇంట్లోనూ ఏమున్నాయో ఐదేళ్ల క్రితమే తెలిసిపోయింది. అదనంగా దానికి ఏమి జోడిరచినా ధనవంతుల కిందకే వస్తారు కాబట్టి, కనీసం ఆ గుమ్మాలెక్కకుండా సర్వే పూర్తిచేసేశారు. ఎలాగూ 20 శాతానికి మించకుండా పేదల సంఖ్యను చూపించాలనే తెర వెనుక లక్ష్యం మేరకు ఈ పనిని పూర్తిచేసేశారు. వాస్తవానికి ఇంటి యజమాని మొబైల్‌కు ఓటీపీ వచ్చిన తర్వాత సర్వేను పూర్తిచేయాలి. కానీ సచివాలయ సిబ్బంది తమ మొబైల్‌కే ఓటీపీ తెప్పించుకొని సర్వే పూర్తయిపోయిందని తేల్చేశారు. అయితే ఇందులో ఎంతమంది నష్టపోతారన్నది ఏప్రిల్‌లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తేగానీ తెలియదు.

పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్‌ పార్టనర్‌షిప్‌ పేరుతో పీ`4 సర్వేను పైలెట్‌ ప్రాజెక్టుగా కడప జిల్లాల్లో గత నెల 20 నుంచి ఈ నెల 3 వరకు నిర్వహించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 8 నుంచి 18 వరకు నిర్వహించాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. పీ`4 సర్వే పూర్తి చేసిన తర్వాత ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి పేదలను వర్గీకరించి నిరుపేదల వివరాలను వెల్లడిరచనున్నారు.

పేదల అవసరాలను గుర్తించడానికి

ఈ సర్వే పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా చేపడుతున్న కార్యక్రమాలకు అదనంగా సామాజికంగా, ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు తమ సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతుంది. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదం చేస్తుందని ప్రకటించింది. సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా సమర్ధవంతమైన ప్రణాళికలు రూపొందించి సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 20 శాతం నిరుపేద కుటుంబాలను గుర్తించి గ్రామసభల ద్వారా నిర్ధారిస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగుపరచడమే సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. 2014`19 మధ్య టీడీపీ ప్రభుత్వం గ్రామాల దత్తత అనే కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకువచ్చి గ్రామాల్లో బడులు, గుడులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు, దాతల సహకారం కోరారు. ఇది కేవలం గ్రామాల అభివృద్ధికి సంబంధించిన కాన్సెప్ట్‌ కాగా ప్రస్తుతం నిరుపేద కుటుంబాల కోసం పీ-4 సర్వే నిర్వహిస్తున్నారు.

హౌస్‌ హోల్డ్‌ డేటాను వినియోగించి..

జిల్లాలో మొత్తం 930 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామాల్లో 835 సచివాలయాలు ఉండగా, అర్బన్‌ ప్రాంతాల్లో 95 సచివాలయాలు ఉన్నాయి. పీ-4 సర్వేలో భాగంగా జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారా ఏయే కుటుంబాల వివరాలు సేకరించాలో ఇప్పటికే సచివాలయ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో వివరాలను నమోదు చేశారు. సర్వే ద్వారా సంక్షేమ పథకాలు పోతాయనే భయంతో వివరాలు దాచిపెడితే సర్వే సిబ్బంది తాము స్వయంగా చూసి పరిశీలించిన అంశాలను అందులో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. తమ ఇంటికి కరెంట్‌ కనెక్షన్‌ లేదని చెప్తే ఇంట్లో ఫ్యాన్‌ తిరుగుతుంటే ఆ సౌకర్యం ఉందని నమోదు చేయాలని సూచించింది. సర్వేకు నిరాకరించే కుటుంబాల వివరాలను నమోదు చేయాలని సర్వే కోసం 27 రకాల ప్రశ్నావళిని రూపొందించారు. ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్‌ నెంబర్ల కోసం గతంలో చేపట్టిన హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ డేటాను ఉపయోగించారు. ఇంటి యజమానికి ఫోన్‌ ఉంటే నెంబరు నమోదు చేసి ఓటీపీ వెరిఫికేషన్‌ చేయనున్నారు. లేదంటే సచివాలయం సిబ్బంది ఫోన్‌కే ఓటీపీ పంపించి వెరిఫికేషన్‌ పూర్తి చేస్తున్నారు. పట్టణాల్లో కొందరు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లకుండానే హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ ఆధారంగా సొంత ఫోన్‌కి ఓటీపీ సెండ్‌ చేసి ఇంటో టీవీ, ఫీజ్‌ ఉందని సర్వే పూర్తి చేస్తున్నారు.

పీ-3తోనే ప్రారంభమైన సర్వీసు ఛార్జీలు

ప్రపంచీకరణ వల్ల పీ`3 విధానం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అనేక భారాలు మోపిందని చెప్పడానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. పీ`3 అమల్లోకి వచ్చిన తర్వాతనే వివిధ రకాల ఛార్జీల పేరుతో అన్ని రంగాల్లో వసూలుచేయడం ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఇప్పుడు పీ`4పైనా అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే పీ`4 సర్వే తెరపైకి వచ్చిందన్న అనుమానాలు లేకపోలేదు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరించడానికి పీ`4 సర్వేను ఒక అస్త్రంగా వాడుకొనేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిందన్న వాదన ఉంది. సర్వేలో సేకరిస్తున్న వివరాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం సర్వేలో సేకరిస్తున్న ఆస్తులు, ఇళ్లు, వాహనాలతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలనూ ఆస్తులుగా పరిగణిస్తున్నారు. ఇంట్లో టీవీ, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, ఫ్రిడ్జ్‌, వాషింగ్‌ మిషన్‌, ఏసీ వంటి పరికరాలనూ ఆస్తులుగానే పరిగణించనుంది. తాగునీటి కోసం ట్యాప్‌ కనెక్షన్‌, పబ్లిక్‌ ట్యాప్‌, చేతిపంపులు, బావులు, సీసా నీళ్లు ఇలా ఏవి వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కుటుంబం పక్కా ఇంట్లో నివసిస్తుందా? లేక కచ్చా ఇంట్లో ఉంటున్నారో వివరాలు నమోదు చేశారు. ఇంట్లో వంట గ్యాస్‌ వినియోగిస్తున్నారా? లేక కట్టెలు, బొగ్గు వంటి వంట చెరుకు ఉపయోగిస్తున్నారా అన్నది నమోదు చేశారు. అర్బన్‌ ప్రాంతాల్లో సొంత ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు.

నిరుపేదలను గుర్తించేందుకే సర్వే

పేదల్లో ఉన్న 20 శాతం మందినే అత్యంత నిరుపేదలుగా గుర్తించేందుకు సర్వే చేపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొనడం, సర్వేలో సేకరిస్తున్న వివరాలు మరింత అనుమానాలకు తావిస్తోంది. సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువ భాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. కుటుంబంలో సంపాదిస్తున్న వారి జాబితాలో పింఛను పొందుతున్న వృద్ధులనూ చేర్చడం అనుమానాలను కలిగిస్తోంది. వారితో పాటు వ్యవసాయ భూమి ఉన్నవారు, వ్యవసాయ కూలీలు, అద్దెలు రూపంలో ఆదాయం పొందుతున్నవారూ ఉన్నారు. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో చదువుకున్న నిరుద్యోగుల వివరాలను సేకరించారు. వివరాలు నమోదు చేసినపుడు బయోమెట్రిక్‌ ద్వారా ధృవీకరిస్తున్నారు. సంపాదనపరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షనర్ల పేర్లు చేరుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page