కాపీ సినిమా ఆస్కార్‌కు వెళుతుందా?
- Guest Writer
- Apr 8
- 1 min read

లాపతా లేడీస్.. రెండేళ్ల ముందు విడుదలై ఘనవిజయం సాధించిన హిందీ చిత్రం. ఆమిర్ ఖాన్ నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీకి కూడా ఎంపికైందీ సినిమా. కానీ అకాడమీ అవార్డు మాత్రం దక్కలేదు. ఐతే అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలతో పాటు అవార్డులూ దక్కించుకుందీ చిత్రం. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మరింత ఆదరణ దక్కించుకుంది.
గత కొన్నేళ్లలో బాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఐతే గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీని కాపీ కొట్టి తీశారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2019లో విడుదలైన అరబిక్ చిత్రం ‘బుర్ఖాసిటీ’కి ఇది ఫ్రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది
బుర్ఖాసిటీలో కొత్తగా పెళ్లయిన ఓ వ్యక్తి తన భార్యను మిస్ అవుతాడు. బుర్ఖా వేసుకున్న వేరే యువతిని తన భార్య అనుకుని వెంట తీసుకెళ్తాడు. తర్వాత చూస్తే తన భార్య మారిపోయిందని తెలుసుకుంటాడు. తప్పిపోయిన తన భార్యను వెతికి కనిపెట్టి తెచ్చుకునే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ‘లాపతా లేడీస్’ స్టోరీ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వేర్వేరు యువతులకు పెళ్లవుతుంది. కొత్త పెళ్లి కూతుళ్ల అవతారంలో రైల్లో ప్రయాణిస్తుండగా.. ముఖానికి పరదా పెట్టుకోవడంతో కన్ఫ్యూజ్ అయి ఒక వ్యక్తి తన భార్య అనుకుని వేరే అమ్మాయిని వెంట తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత తన భార్యను తిరిగి తీసుకురావడానికి అతను చేసే పోరాటం ఎంత మేర ఫలించింది.. తన వెంట వచ్చిన అమ్మాయి వ్యవహారం ఏంటి.. ఈ నేపథ్యంలో సినిమా రసవత్తరంగా నడుస్తుంది. మొత్తం సినిమాను కాపీ కొట్టారని చెప్పలేం కానీ.. కాన్సెప్ట్ అయితే ‘బుర్ఖా సిటీ’ నుంచే తీసుకున్నట్లుంది ‘లాపతా లేడీస్’ టీం. అయినా సరే.. కాన్సెప్ట్ కాపీ కొట్టి తీసిన సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపడం ఏంటి అంటూ టీం మీద ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు.
Comentarios