top of page

క్యూట్‌ కేతిక కవ్వింపులు

  • Guest Writer
  • Apr 15
  • 2 min read


ఆకాష్‌ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. ఆ సినిమా నిరాశ పరిచిన అందంతో పాటు నటనతో ఆకట్టుకున్న కేతిక శర్మకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కాయి. అదే ఏడాదిలో లక్ష్య సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడలేదు. వరుసగా రెండు ఫెయిల్యూర్స్‌ పడితే ఏ కొత్త హీరోయిన్‌ అయినా ఆఫర్లు దక్కించుకోవడం కాస్త కష్టమే. అయినా కూడా ఈ అమ్మడికి మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో రంగరంగ వైభవంగా సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా హిట్‌ అయి ఉంటే కచ్చితంగా టాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి బ్రేక్‌ దక్కేది. కానీ ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.

పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘బ్రో’ సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా మరో అవకాశంను దక్కించుకుంది. సినిమాలు ఫెయిల్యూర్‌ అవుతూ వచ్చినా లక్కీగా ఈ అమ్మడికి గుర్తింపు పెరుగుతూ వచ్చింది. వరుసగా ఈ అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ నిరాశ పరుస్తూ వచ్చినా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది రాబిన్‌హుడ్‌లో ఐటెం సాంగ్‌ను చేయడం ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈమె రెండు సినిమాల్లో నటిస్తోంది. తెలుగు సినిమాల్లోనే కాకుండా ఈసారి వేరే భాషలోనూ ఈమె నటిస్తున్న కారణంగా లక్‌ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు నమ్ముతున్నారు. మరి ఈ అమ్మడికి హిట్‌ పడేనా చూడాలి.

సినిమాల్లో అందంగా కనిపించే అవకాశాలు తక్కువే ఉన్నా సోషల్‌ మీడియాలో అందాల ప్రదర్శణకు హద్దులు ఉండవు. కనుక సోషల్‌ మీడియాలో అందరు హీరోయిన్స్‌ మాదిరిగానే కేతిక శర్మ కూడా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. వరుస ఫ్లాప్స్‌ పడ్డా కూడా ఈమెకు ఇంకా ఆఫర్లు దక్కుతున్నాయి అంటే కచ్చితంగా అందుకు ఇలాంటి అందమైన ఫోటో షూట్స్‌ను షేర్‌ చేయడం అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అంటూ ఇలాంటి ఫోటోలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈమె షేర్‌ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి.

తాజా ఫోటోల్లో కేతిక క్యూట్‌గా కనిపిస్తూనే కవ్విస్తోంది. విభిన్నమైన ఔట్‌ ఫిట్‌లో సింపుల్‌ అండ్‌ స్వీట్‌ అనిపించుకుంటుంది. బ్లూ జీన్స్‌ , వైట్‌ టాప్‌తో పాటు, ఒక షర్ట్‌ బటన్స్‌ లేకుండా ధరించి ఉన్న కేతిక ఫోటోలను నెటిజన్స్‌ అలా చూస్తు ఉన్నారు. తక్కువ సమయంలోనే లక్ష లైక్స్‌ను సొంతం చేసుకున్న ఈమె మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దాదాపుగా 35 లక్షల మంది ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న కేతిక శర్మ ఇంతటి అందంతో మరి కొన్నాళ్ల తర్వాత అయినా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. కేతిక శర్మ ఇంత అందంగా ఉంది కనుక ఇండస్ట్రీలో కచ్చితంగా మంచి సినిమాల్లో నటించే అవకాశాలు రావాల్సిందే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

నాని లాజిక్‌ కరెక్టేనా?

తన సినిమాని మార్కెట్‌ చేసుకోవడం ఎలాగో నానికి బాగా తెలుసు. ‘‘కోర్ట్‌’’ సినిమా అందుకు పెద్ద ఉదాహరణ. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. కంటెంట్‌ లో బలం ఉండడం ఒక కారణమైతే, నాని ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లిన విధానం మరో కారణం. ‘ఈ సినిమా నచ్చకపోతే నా రాబోయే హిట్‌ 3 చూడొద్దు’ అని చెప్పి, అందర్నీ తన వైపు తిప్పుకొన్నాడు. ఈ స్టేట్‌ మెంట్‌ బాగా వర్కవుట్‌ అయ్యింది. మే 1న రాబోతున్న హిట్‌`3కి కూడా తానే నిర్మాత. ఈ సినిమా ప్రమోషన్‌ని కూడా తనదైన స్టైల్‌ లో మొదలు పెట్టేశాడు నాని. ‘ఈ సినిమాకు ఆడాళ్లూ, పిల్లలూ దూరంగా ఉండండి. మా అబ్బాయికి కూడా ఈ సినిమా చూపించను’ అనేశాడు. నిజంగా ఇది బోల్డ్‌ స్టేట్‌మెంటే. పిల్లలు, ఆడాళ్లూ చూడలేనంత వైలెన్స్‌ తన సినిమాలో ఉందని స్ట్రయిట్‌ గానే చెప్పేశాడు నాని. తన సినిమాలు పిల్లలకు బాగా నచ్చుతాయి. లేడీ ఫాలోయింగ్‌ నానికి బలం. వాళ్లిద్దర్నీ నాని ఈ స్టేట్‌మెంట్‌ తో దూరం చేసుకొన్నాడు.

కాకపోతే ఇక్కడ నాని దగ్గర ఓ లాజిక్‌ వుంది. ‘హిట్‌ 3’ ఎవరి కోసం తీశాడో నానికి బాగా తెలుసు. యాక్షన్‌ ఇష్టపడేవాళ్ల కోసమే తాను ఈ సినిమాని క్యాటర్‌ చేస్తున్నానని నాని గ్రహించాడు. అదే ఫాలో అవుతున్నాడు. ‘యానిమల్‌’, ‘మార్కో’ సినిమాలేమైనా పిల్లలు చూశారా? ఆ సినిమాలు ఎవరికి నచ్చాలో వాళ్లకు నచ్చాయి. సూపర్‌ హిట్‌ అయ్యాయి. ‘హిట్‌ 3’ కోసం నాని ఫాలో అవుతున్న ఫార్ములా కూడా ఇదే కావొచ్చు. ఈ రకంగా ఆలోచిస్తే నాని లాజిక్‌ కరెక్టే. ఇప్పటి యూత్‌ ఆలోచనలు మారిపోయాయి. వాళ్లకు ఏదైనా సరే.. హై డోస్‌లో ఇవ్వాల్సిందే. అలాంటి సినిమాలు నచ్చుతున్నాయి కూడా. అందుకే నాని ఇప్పుడు వాళ్లకే గాలం వేయబోతున్నాడు. నాని ఇంత యాక్షన్‌ చేస్తే జనం చూస్తారా? అనే అనుమానాలూ అక్కర్లెద్దు. ఎందుకంటే ఇది వరకే ‘దసరా’ సినిమాలో నాని తన ఇమేజ్‌ మార్చుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడ సక్సెస్‌ అయ్యాడు. కాబట్టి నాని వెండి తెరపై గొడ్డలి పట్టుకొని రప.. రప.. నరుకుతున్నా, చూడ్డానికి నమ్మశక్యంగానే ఉందిప్పుడు.

తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page