క్రికెటర్‌ని ఇంకా నీడలా వెంటాడుతోంది
- Guest Writer
- Apr 8
- 2 min read

ఊర్వశి రౌతేలా వర్సెస్ రిషబ్ పంత్ వివాదం గురించి తెలిసిందే. ఈ ఇద్దరూ గతంలో తీవ్రంగా ఘర్షణ పడినా కానీ, ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారని అభిమానులు నమ్మారు. ముఖ్యంగా ఊర్వశి అతడంటే పడి చస్తుంది. రిషబ్ పేరెత్తితే చాలు చాలా సిగ్గుల మొగ్గయిపోతుంది.
ఇప్పుడు మరోసారి రిషబ్ గురించి తనను మీడియా ప్రశ్నించగా సిగ్గు పడిపోయింది. అతడితో కలిసి ప్రకటనలో నటించే అవకాశం వస్తే నటిస్తారా? అని టీవీ చానెల్ హోస్ట్ అడిగినప్పుడు అది ప్రకటనను బట్టి ఉంటుందని సమాధానమిచ్చింది. కానీ తన బుగ్గల్లో కెంపులు ఎరుపెక్కాయి.. సిగ్గుల మొగ్గవుతున్న వైనం బయటపడిరది.
తాజా ఇంటర్వ్యూలో మీకు ఐపీఎల్‌లో ఏ టీమ్ అంటే ఇష్టం? అని హోస్ట్ ప్రశ్నించగా, విరాట్ కోహ్లి జట్టయిన ఆర్సీబీ, ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ అని చెప్పింది. ఆర్సీబీ సరే కానీ, లక్నో పేరెత్తడమేమిటీ? అంటూ సందేహాలు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో రిషబ్ పంత్ లక్నోకి ఆడుతున్నాడు. అందుకే లక్నో పేరును తెరపైకి తెచ్చిందా? అంటూ డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓసారి ఢల్లీి డేర్ డెవిల్స్ జట్టంటే ఇష్టమని చెప్పింది. ఆ సీజన్ లో పంత్ ఢల్లీికి ఆడగా.. ఈసారి అతడిని లక్నో భారీ ధరకు కొనుగోలు చేసింది. పంత్ టీమ్ మారడంతోనే ఊర్వశి రౌతెలా కూడా నచ్చిన టీమ్‌ని మార్చేసిందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. 2024లో మాట్లాడిన వీడియో, 2025లో చాటింగ్ వీడియో రెండిటినీ కలిపి వైరల్ చేస్తున్నారు. ఈ రెండు వీడియోల్లో ఊర్వశి టీమ్ లను ఎలా మార్చిందో స్పష్ఠంగా కనిపిస్తోంది. ఇదంతా ఆర్పీ గురించేనని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఊర్వశితో గొడవలు ముగిసాక రిషబ్ పంత్ ఇషా నేగి అనే అందమైన అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని మీడియాలో కథనాలొచ్చాయి. కానీ దీనిపై అతడు స్పష్ఠతనివ్వలేదు. ఇప్పటికీ ఊర్వశి ఒంటరి. రిషబ్ పై ప్రేమ ఎంతమాత్రం తగ్గలేదని తన చర్యలు చెబుతున్నాయి. గతంలో మాదిరిగానే అతడు ఆడే ఆటను స్టేడియంలో వీక్షించేందుకు విచ్చేస్తోంది. కానీ రిషబ్ మనసులో ఏం ఉందో ఎవరికీ తెలీదు. నోరాతో పోలిక సరే..! సోషల్ మీడియాలో తనను తోటి నటి నోరా ఫతేహితో పోల్చిన ట్రోలర్లను నటి ఊర్వశి రౌతేలా తీవ్రంగా విమర్శించారు. ఆన్‌లైన్ ప్రతికూలత తనను కలవరపెట్టదని ఉర్వశి స్పష్టం చేస్తూ ఈ ట్రోలింగ్ సరికాదని అంది. ట్రోలింగ్ తనను ప్రభావితం చేస్తుందా అని అడిగినప్పుడు.. నేను అందరి అభిప్రాయాలను వ్యక్తిగతంగా తీసుకోను. ప్రతికూల వ్యాఖ్యలతో నేను అంత తేలికగా ప్రభావితం కాను అని తెలిపింది. ఎవరైనా ఏదైనా అసభ్యంగా మాట్లాడితే.. అది నన్ను ఇబ్బంది పెట్టనివ్వను. ప్రతి నటి లేదా నటుడు పరిశ్రమకు తనదైన ప్రత్యేకతను తీసుకువస్తారని నేను నమ్ముతున్నాను.. అని వెల్లడిరచింది. నోరా లేదా ఎవరితో పోల్చినా నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రతి కళాకారుడికి వారి స్వంత స్పేస్ ఉంటుందని అన్నారు. ఉత్తమంగా నటించడం ముఖ్యమని అన్నారు.
సన్నీ డియోల్ టైటిల్ రోల్‌లో నటించిన ‘‘జాత్’’ లో ఊర్వశి ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
Comentarios