top of page

కల్పన ఆత్మహత్యాయత్నంలో అసలు నిజం!

  • Writer: ADMIN
    ADMIN
  • Mar 6
  • 1 min read


గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చేరగా దీనిపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇంతకుముందే కల్పన కుమార్తె దయా ప్రసాద్‌ ప్రభాకర్‌ అది ఆత్మహత్యాయత్నం కాదని స్పష్టం చేశారు. తాజాగా కెపిహెచ్‌బి పోలీసులు ఇది ఆత్మహత్యాయత్నం కాదని ఒక ప్రకటనను విడుదల చేసారు.

ఈ విషయాన్ని కల్పన ధృవీకరించినట్టు తెలిపారు. గాయని అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడం వల్ల అపస్మారక స్థితికి చేరుకున్నారని పోలీసులు వెల్లడిరచారు. అయితే కేరళ నుంచి తన కూతురు హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయ్యేందుకు అంగీకరించకపోవడంతో గాయని కల్పన ఆత్మహత్య చేసుకుంటానని పరిశ్రమ వ్యక్తులతో అన్నట్టు కొన్ని కథనాలు వచ్చాయి. అయితే ఇవేవీ నిజం కాదని పోలీసులు అన్నారు. పాప తన తల్లి కల్పన గురించి కుమార్తె దయా ప్రసాద్‌ బుధవారం మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, తన తల్లి అనుకోకుండా అధిక మోతాదులో మందులు తీసుకున్నారని చెప్పారు. %``%నా తల్లి ఒక గాయని, ఆమె ఎల్‌ఎల్‌బి, పిహెచ్‌డిలను ఒకేసారి చదువుతోంది. ఇది నిద్రలేమికి దారితీసింది. నిద్రలేమికి చికిత్స చేయడానికి వైద్యులు ఆమెకు టాబ్లెట్‌ రాశారు. ఇది కొంచెం అధిక మోతాదు.. కానీ ఇది ఆత్మహత్యాయత్నం కాదు%``% అని స్పష్టం చేసారు. తమ కుటుంబం పూర్తిగా క్షేమంగా ఉందని దయా ప్రసాద్‌ అన్నారు. నా అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. కుటుంబంలో అందరూ పూర్తిగా క్షేమంగా ఉన్నారు. దయచేసి కుటుంబ విషయాలను మార్చవద్దు! అని అభ్యర్థించారు. మంగళవారం సాయంత్రం గాయని కల్పన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన తర్వాత నగరంలోని నిజాంపేటలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page