చూపు తిప్పనివ్వని సికాకుళం చిన్నది
- Guest Writer
- Apr 9
- 2 min read

తెలుగు ప్రేక్షకులు సిద్దు ఫ్రమ్ సికాకుళం సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మంజరి ఫడ్నిస్. తెలుగులో ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా, ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు సినిమాల్లో కనిపించకున్నా ఈమె గతంలో చేసిన పాత్రల కారణంగా తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో ఈమె రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. ఆకట్టుకునే అందం తో పాటు, ఈమె నటనకు పలు సినిమాలతో మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.
2004లో హిందీ సినిమా రోక్ సాకో తో రోక్ లో తో మంజరి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు దక్కనప్పటికీ తన అందం కారణంగా ఆఫర్లను సొంతం చేసుకుంది. తెలుగులో ఈమె మొదటి సారి సిద్ధు ఫ్రమ్ సికాకుళం సినిమాతో 2008లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమె తెలుగులో నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈమెకు ఎక్కువ శాతం మెయిన్ హీరోయిన్ పాత్రలు దక్కక పోవడంతో పాటు, స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు దక్కక పోవడంతో నిరాశే మిగిలింది.
టాలీవుడ్‌లో వరుసగా నిరాశే మిగలడంతో ఆఫర్లు కనుమరుగు అయ్యాయి. అయితే ఈమెకు తెలుగులో మిస్ అయిన ఆఫర్లు హిందీ నుంచి వచ్చాయి. బాలీవుడ్‌లో క్రమం తప్పకుండా చిన్నా చితకా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. మధ్య మధ్యలో కన్నడ సినిమాలు, మరాఠీ సినిమాలను సైతం ఈమె చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మంజరి తన అందమైన ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంది. తన ఫాలోవర్స్‌కి రెగ్యులర్‌గా వినోదాన్ని అందిస్తున్న ఈమె మరోసారి ఈ ఫోటోలతో వైరల్ అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మరోసారి ఈమె తన గురించి మీడియాలో చర్చ జరిగేలా చేసింది.
రింగుల జుట్టుతో అందమైన బ్రా లెస్ ఔట్ ఫిట్‌తో మంజరి ఫడ్నిస్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయిలో అందంగా ఉన్నప్పటికీ మంజరికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. దక్కాల్సిన ఆఫర్లు దక్కలేదు అంటూ పలువురు అభిప్రాయం చేస్తున్నారు. జానే తు యా జానే నా మంచి విజయం సాధించడంతో ఇప్పటికీ బాలీవుడ్‌లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది సైతం ఈమె నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఒక హిందీ సినిమాతో పాటు ఒక మరాఠీ సినిమాను ఈమె చేస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఈ స్థాయిలో క్రేజ్ దక్కించుకోవడం ఈమెకే చెల్లింది. ఇకపై అయినా ఈమెకు వరుస ఆఫర్లు దక్కాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో..
Comments