చిరు-వెంకీ.. ఇలా ఆగిపోయింది
- Guest Writer
- Mar 27
- 1 min read

చిరంజీవితో సినిమా చేయాలనుకునే జాబితాలో వున్న దర్శకుల్లో వెంకీ కుడుముల ఒకరు. భీష్మ తర్వాత వెంకీకి మెగా కబురు వచ్చింది. ఓ కథని చెప్పారు. అది ఎంతకీ ముందుకు సాగలేదు. నిజానికి వశిష్ట, అనిల్ రావిపూడికి ముందే వెంకీకి పచ్చజెండా ఊపారు చిరు. కానీ ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు. దీనికి గల కారణం స్వయంగా వెంకీనే చెప్పారు.
‘భీష్మ సినిమా తర్వాత చిరంజీవి గారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎక్సైట్ అయ్యారు. నేను చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్‌ని. ఆయనతో చేసే సినిమా చాలా ప్రత్యేకంగా వుండాలని స్టోరీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్‌కి చాలా సమయం తీసుకుని చేశాను. అయితే ఎక్కడో ఓచోట ఆయన్ని మెప్పించలేపోయాను. మేము అనుకున్నలా అది అవ్వలేదు. మరో కథతో వస్తానని చెప్పి వచ్చేశాను’ అని జరిగిన సంగతి చెప్పారు వెంకీ.
అయితే ఎప్పటికైనా చిరుతో సినిమా తీసి తీరుతా అని నమ్మకంగా వున్నారు వెంకీ. ఆయన డైరెక్ట్ చేసి రాబిన్‌హుడ్ ఈ నెల 28న వస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే గనుక మళ్ళీ మెగా తలుపులు తెచురుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
Comments