top of page

తెలుగును తాకట్టు పెట్టిన ‘దేశం’

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 13
  • 2 min read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం న్యూఢల్లీిలో ‘ఇండియా టుడే’ సదస్సులో మాట్లా డిన తీరు బాగుంది. ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి, కొన్ని విలువలకు ప్రతినిధిగా ఆయన మాట్లాడారు. మాట్లాడిన విషయం మీద తనకు నిబద్ధత ఉన్నదని, ఆ మాటలను నమ్మి చెబుతున్నారని చూసినవారికి, విన్నవారికి అనిపించేటట్టుగా ఆయన మాట్లాడారు. ముఖ్యమైన విధాన విషయంలో మోదీ ప్రభుత్వం మీద తన ప్రతిఘటనా వైఖరిని ప్రకటించారు. బీజేపీ అగ్రనాయకత్వం విషయంలో మెతకగా ఉంటున్నారని, లోపాయికారీగా వారితో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్న సమయంలో తాజాగా, రెండు శాసనమండలి స్థానాలను అనాలోచితంగానో, అసమర్థత వల్లనో బీజేపీకి వదిలేశారని విమర్శలు వస్తున్న కాలంలో రేవంత్‌ ఈ తీవ్రమైన విమర్శలు చేయడం విశేషం. దక్షిణాదికి వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేస్తున్నదని అనడం చిన్న ఆరోపణ కాదు. మోదీ గుజరాత్‌ దూత అయితే, తాను తెలంగాణ దూతనని అనడం పెద్దమాటే. అయితే తన వైఫ ల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికో, కేంద్రంతో తనకు ఏ లాలూచీ లేదని ప్రదర్శించుకోవడానికో రేవంత్‌ ఈ ధాటి చూపించారని కూడా కొందరు అనుకోవచ్చు, కేసీఆర్‌ను ఢీకొనడానికి తీవ్రమైన విమర్శా ధోరణిని, దూషణల భాషను ఆశ్రయించారు. కాంగ్రెస్‌వాదిగా మారిపోయి, ముఖ్యమంత్రి స్థానం సంపాదించుకున్నారు. వివిధ అంశాల మీద కాంగ్రెస్‌ విధానాలు వైఖరులను స్వీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఈ దేశంలో ఎవరి మీదా ఏ భాషనూ రుద్దలేరు, డీలిమిటేషన్‌ జరగదు, జరిగినా మేం ఎన్డీయే మీటింగ్‌లో మాట్లాడుకుంటాం అని లోకేశ్‌ మాటలు, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ న్యాయ సిద్ధాంతాన్ని, మాతృభాషాభిమానాన్ని విసర్జించినట్టు సూచిస్తాయి. ఎన్డీయేలోకి తెలుగుదేశం, పిల్లిలో ఎలుక ఐక్యమైనంత గాఢంగా కలిసిపోయిందని అర్థమవుతోంది. అందుకు భిన్నంగా, రేవంత్‌ రెడ్డి ప్రకటించిన వైఖరి, తెలంగాణ రాష్ట్రసమితి మొదటి దఫా పాలన తర్వాత, దాదాపు ఏ సైద్ధాంతిక స్పర్శా లేకుండా నిస్సారంగా ఉండిపోయిన తెలంగాణకు తిరిగి కొత్త జీవాన్ని అద్దింది. తమిళనాడు చొరవ కారణంగా దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన డీలిమిటేషన్‌ అంశంలో, హిందీ విధింపు విషయంలో తెలంగాణ గొంతును కూడా వినిపించడం విశేషం. ఎంకే స్టాలిన్‌ ఏర్పాటు చేసే దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశానికి తాను హాజరవుతానని రేవంత్‌ చెప్పారు. భారతదేశ రాజకీయాలలో అనివార్యంగా రూపొందుతున్న ఉత్తర, దక్షిణ సమీకరణల్లో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోక తప్పదు. డీలిమిటేషన్‌ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పడానికి రాష్ట్ర బీజేపీకి అనేక పరిమితులున్నాయి. సమాధానం చెప్పలేని బలహీనతలో ఆ పార్టీ పడిపోయే అవకాశం ఉంది. మరి, బీఆర్‌ఎస్‌? డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఇంతకు మునుపు అభ్యంతరపెట్టింది కానీ ఆ అంశం మీద రాష్ట్ర అధికార పార్టీతో కలిసి, దక్షిణాది కూటమితో కలిసి పోరాడుతుందా? లేక తాను విడిగా వ్యతిరేకతను చెబుతానంటుందా? ఫెడరలిజాన్ని మరింతగా దెబ్బతీసే డీలిమిటేషన్‌ మీద గట్టి వైఖరి తీసుకుని ప్రతిఘటించకుండా ఉండ డం ప్రాంతీయపార్టీకి సాధ్యం కాదు. ఇదే సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ కూడా పాల్గొ న్నారు. డీలిమిటేషన్‌ వివాదం అంతా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డిఎంకె సృష్టిస్తున్నదన్న ట్టుగా ఆయన మాట్లాడారు. జనాభా నియంత్రణ పాటించినందువల్ల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పో వడం న్యాయం కాదన్నది అంగీకరిస్తూనే, ప్రస్తుత నిష్పత్తులకు ఏ భంగమూ రాదని అమిత్‌ షా చెప్పారు కదా అని అన్నారు లోకేశ్‌. నిజానికి, అమిత్‌ షా అటువంటి నిర్దిష్టమయిన వాగ్దానం ఏదీ ఇవ్వలేదు. దక్షిణాది రాష్ట్రాలకు ఒక్కసీటు కూడా తగ్గదని మాత్రమే అమిత్‌ షా అన్నారు. తగ్గుతుందని కాదు కదా, ఇప్పటి కలవరం? ఉత్తరాది రాష్ట్రాలకు పెరిగినంతగా పెరగకపోవడం వల్ల రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న నిష్పత్తి చెదిరిపోతుందని, 24 శాతం ఉన్న దక్షిణాది లోక్‌సభ ప్రాతినిధ్యం 19కు, అంతకంటే దిగువకు పడిపోతుందని కదా ఆందోళన! 1971 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయడమో, లేదా, ఇప్పటి లోక్‌సభ లోని రాష్ట్రాల ప్రాతినిధ్యం నిష్పత్తిలోనే పెంచే సీట్లను నింపడమో, లేదా నిరవధికంగా డీలిమిటేషన్‌ ను వాయిదా వేయడమో, మరేదైనా ప్రత్యామ్నా యాన్ని అన్వేషించడమో జరిగితే తప్ప, అన్యాయాన్నినివారించలేము. హిందీ విధింపు కానీ, ప్రస్తుత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ కానీ దక్షిణాదికి కీలకమయిన సమస్యలైనప్పుడు, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ దాని ఆధారంగా ఎన్నికల పోరాటం చేస్తే తప్పేమిటి? ఆ పార్టీకి మిత్రపక్షమయిన తెలం గాణ కాంగ్రెస్‌ ఆ పోరాటంలో భాగస్వామి అయితే పొరపాటేమిటి?

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page