తమన్నా అభిమానులకు పండగే..!
- Guest Writer
- Apr 18
- 3 min read

సీక్వెల్స్ తీయటం ఎప్పుడూ కత్తి మీద సామే. అయినా సంపత్ నంది ధైర్యం చేసారు. తమన్నాను తోడు తెచ్చుకున్నాడు. 2022లో ఓటీటీలో వచ్చి హిట్ గా నిలిచిన లి‘ఓదెల రైల్వే స్టేషన్ కి ఇది అఫీషియల్ సీక్వెల్. ఈసారి కథలో మరింత మిస్టరీ, మరింత విజువల్ గ్రాండియర్, అంతకన్నా పవర్‌ఫుల్ ఎలిమెంట్స్ నింపామన్నారు. ఇవన్నీ కలసి ‘ఓదెల 2’ ని ఓ థ్రిల్లింగ్ ట్రిప్‌గా మార్చాయా లేదా, ఈ రోజు థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం ఎలా ఉంది? అసలైన థ్రిల్ ఇచ్చిందా? చూద్దాం!
స్టోరీ లైన్:
ఓదెల.. ఓ సాధారణ గ్రామం కాదు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లయితే చాలు.. ప్రాణమే ముప్పు! ఎందుకంటే అక్కడ తిరుపతి అనే రాక్షసుడు చనిపోయిన తరువాత కూడా... పీడగా మారి తిరిగి వచ్చాడు! తిరుపతి (వశిష్ఠ ఎన్. సింహ).. వాడివరకు ఆడదాన్ని హింసించి చంపడమే లైఫ్‌గా పెట్టుకున్న క్రూరుడు! అతడి భార్య రాధ (హెబ్బా పటేల్) సహనం కోల్పోయి తానే నరికి చంపేసింది. ఊరు ఊపిరి పీల్చింది. కానీ... అసలు హారర్ అప్పుడే మొదలైంది! తిరుపతి ప్రేతాత్మగా తిరిగి వచ్చి ఊరిలో పెళ్లైన వధువులను వేటాడడం మొదలుపెట్టాడు. దుష్టశక్తిగా మారిన అతడి వింత పగ... ఊరి మొత్తాన్ని వణికిస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఎంట్రీ ఇచ్చింది నాగ సాధువు భైరవి (తమన్నా). మిస్టిక్ ఫిగర్-నాగ సాధువు భైరవి (తమన్నా) వచ్చి ఏం చేసింది... ఊరిని ఆ దుర్మార్గుడు నుంచి కాపాడిరదా? ఓదెలలో అసలు జరిగిందేమిటి? తిరుపతి ఆత్మకి స్వస్తి చెప్పగలిగిందా భైరవి? లేక మళ్లీ రక్తపాతం జరగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
మొదటి పార్ట్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎక్కడ ఆగిందో... అక్కడి నుంచే ‘ఓదెల 2’ మొదలైంది. కానీ ఈసారి కథలో క్రైమ్ కంటే కిక్కిచ్చే హారర్, రక్తపాతం ఎక్కువ. గతం కథను నెమ్మదిగా వెనక్కి లాగుతూ, ఈ సినిమా నేరుగా తీసుకెళ్లింది. ప్రేతాత్మకు, పరమశక్తికి మధ్యే ఓ ఢీ షో జరుగుతున్నట్లు స్క్రీన్ ప్లే రెడీ చేసారు చేసినట్టు! సినిమాలో విలన్ తిరుపతిని ఖననం చేస్తారు. కానీ అతని కదలికలు ఆగవు! సమాధిలోంచే బయటికి వచ్చి, వధువుల్ని చంపే సన్నివేశాలు మొదట్లో థ్రిల్లింగ్‌గా ఉన్నా, కొన్నాళ్లకే రిపీట్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. ఇంటర్వల్ ముందు తమన్నా ఎంట్ర అదిరిపోయే ఎలివేషన్! ఆవులను కాపాడే యాక్షన్ సీన్‌తో మాస్ టచ్‌తో భైరవి పాత్రకు పవర్‌ను నింపాడు దర్శకుడు. అయితే ఆమె వచ్చి చేసిందేమీ లేదు ప్రేతాత్మతో ఫైటింగ్ చేయటం తప్పించి ఓవరాల్ గా చూస్తుంటే... ‘అరుంధతి’ స్టైల్ మిస్టికల్ హారర్, ‘అఖండ’ తరహా శక్తి పాత్రలో తమన్నా అన్నీ మిక్సీలో వేసి తెరపైకి తెచ్చినట్టు అనిపించింది. కానీ కథకు కావలసిన స్పీడ్, స్పార్క్ కొద్దిగా మిస్సయ్యింది. క్లైమాక్స్ ముందు కొన్ని విజువల్స్ ‘అరుంధతి’ స్టైల్‌లో కనిపిస్తాయి. ముఖ్యంగా బ్యాక్‌డ్రాప్స్. కానీ ఆ ఎఫెక్ట్ అంత బలంగా పండినట్లు అనిపించదు. అలాగే చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌తో ‘ఓదెల 3’ కోసం లీడ్ తీసుకున్నారు!
టెక్నికల్‌గా..
సంపత్ నంది రాసిన కథకు బలమైన ఎమోషన్ లేదా టర్నింగ్ పాయింట్ లేదు. దర్శకుడు అశోక్‌తేజ తనవంతు ప్రయత్నం చేశాడు, కాని కంటెంట్ లోపం వల్ల ఇంపాక్ట్ సడలిపోయింది. గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఓ మిస్టిక్ టచ్ ఇస్తుంది. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం విజువల్స్‌ను మెరుగ్గా ప్రెజెంట్ చేసింది. నిర్మాణ విలువలు కథకు తగ్గ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే, టెక్నికల్ టీమ్ పర్ఫెక్ట్‌గా పనిచేసినా... కథలో కరువు వల్ల సినిమా ఓ మిస్‌డ్ అప్పొర్చునిటీలా మారిపోయింది. ‘ఓదెల 2’ లో తమన్నా భైరవిగా గెటప్ ఆకట్టుకున్నా, ఆమె నటనలో పాత్రోచితంగా లేదు . వశిష్ట తిరుపతి పాత్రలో మంచి ఇంపాక్ట్ చూపించారు. హెబ్బా పటేల్‌కు పెద్ద పాత్ర లేదు. ఓదెల-2 కేవలం తమన్నా కోసం వెళ్లాలి. ఆమె అభిమానులకు బాగా నచ్చుతుంది.
జోశ్యుల సూర్యప్రకాశ్
‘సౌత్ లో గుడి కట్టాలి’.. దబిడి దిబిడి బ్యూటీ వింత కోరిక!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టులతో, ఇంటర్వ్యూల్లో కామెంట్స్ తో ట్రెండిరగ్ లో ఉంటుంది అమ్మడు. ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. అసలేం జరిగింది.. ఊర్వశి రౌతేలా ఏమందంటే..
తాజాగా ఊర్వశి ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఒక గుడి ఉందని తెలిపింది అమ్మడు. ‘‘ఉత్తరాఖండ్ స్టేట్ లో నా పేరుతో టెంపుల్ ఉంది. మీరు ఎవరైనా బద్రీనాథ్ టెంపుల్ కు వెళ్లినప్పుడు, సరిగ్గా దాని పక్కనే అది మీకు కనిపిస్తుంది. ఈసారి నా గుడి కూడా సందర్శించండి’’ అని తెలిపింది.
‘‘ఢల్లీి యూనివర్సిటీలో నా ఫోటోకు పూలమాల వేసి దండమామాయి ని అంతా పిలుస్తారు. ఆ విషయం తెలిసి నేను షాకయ్యాను. వార్తలు కూడా వచ్చాయి. కావాలంటే చదివి తెలుసుకోవచ్చు. అయితే నాకు సౌత్ లో మంచి అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ తో యాక్ట్ చేశాను’’ అంటూ గుర్తు చేసుకుంది. అందుకే సౌత్ లో కూడా తనకు గుడి కట్టాలని ఆశిస్తున్నట్లు తెలిపింది ఊర్వశి. అదే సమయంలో మరి మీ గుడికి వచ్చిన వారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా? అని యాంకర్ అడగ్గా.. ఆమె ఆసక్తికరం సమాధానం ఇచ్చింది. అది ఆలయమని, అన్ని గుడుల్లో ఏమేమి జరుగుతాయో అక్కడ కూడా అవే జరుగుతాయని చెప్పడం గమనార్హం. మొత్తానికి ఇప్పుడు ఊర్వశి కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. ఆమె ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. ఊర్వశి మేడమ్.. ఇదేం వింత కోరిక అని అడుగుతున్నారు. ఆమె ఏదో భ్రమలో ఉందేమో అని అంటున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే.. సింగ్ సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఊర్వశి రౌతేలా. తన అందచందాలతో మెప్పించిన అమ్మడు.. తెలుగులో కూడా సందడి చేసింది. రీసెంట్ గా బాలయ్య డాకు మహారాజ్ మూవీలో దబిడి దిబిడి సాంగ్ తో అలరించిందనే చెప్పాలి. అంతకుముందు వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద వంటి పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. ఇప్పుడు టెంపుల్ కావాలనే వింత కోరికతో వార్తల్లో నిలిచింది.
తుపాకి.కామ్ సౌజన్యంతో..
Opmerkingen