top of page

తమన్నా సెంటిమెంట్‌ కొనసాగిస్తాడా..?

  • Guest Writer
  • Apr 16
  • 3 min read


సినిమా వాళ్ల సెంటిమెంట్స్‌ లో భాగంగా ఫలానా డైరెక్టర్‌ తన ప్రతి సినిమాలో ఆ హీరోయిన్‌ ని తీసుకుంటాడు తెలుసా అన్న విధంగ వార్తలు వచ్చేలా చేస్తాయి. ఇది ఆ దర్శకులు సెంటిమెంట్‌ లేదా ఆ హీరోయిన్‌ లక్కీ ఛార్మ్‌ గా భావిస్తారు కాబట్టే కొనసాగిస్తారు. హీరో, హీరోయిన్‌ కాంబినేషన్‌, డైరెక్టర్‌ హీరో కాంబినేషన్‌ ఎలానో.. డైరెక్టర్‌ హీరోయిన్‌ కాంబినేషన్స్‌ కూడా కొన్నిసార్లు వర్క్‌ అవుట్‌ అవుతుంది. ఐతే ఇలాంటి కాంబినేషన్స్‌ చాలా అరుదుగా ఏర్పడతాయి.

ప్రస్తుతం ఈ సెంటిమెంట్‌ తో సినిమాలు చేస్తున్న దర్శకుల లిస్ట్‌ లో సంపత్‌ నంది ఉంటారు. ఆయన మొదటి సినిమా ఏమైంది ఈవేళ వదిలిపెడితే తర్వాత చేసిన రచ్చ నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాలో తమన్నా హీరోయిన్‌ గా నటించింది. ఓదెల 1 లో సంపత్‌ నంది తమన్నాని మిస్‌ చేశాడు. అఫ్కోర్స్‌ అది ఆయన డైరెక్షన్‌ చేయలేదు కానీ అన్నీ ఆయనే దగ్గర ఉండి ఆ సినిమాకు చూశారు. ఇక ఓదెల 2 కి మళ్లీ తమన్నాని తీసుకొచ్చారు. రెండు దశాబ్దాల కెరీర్‌ లో తమన్నా ఇలా పూర్తిగా పాత్రలో ట్రాన్స్‌ ఫర్మ్‌ అయ్యి చేసిన సినిమాలు చాలా తక్కువ. నాగ సాధువుగా తమన్నా తన లుక్స్‌ తో ఆకట్టుకుంటుంది. తమన్నా లేకపోతే సంపత్‌ నంది సినిమాలు చేయడేమో అన్న రేంజ్‌ లో వీళ్ల కాంబినేషన్‌ గురించి మాట్లాడుకున్నారు. ఐతే ఓదెల 2 కన్నా ముందే సంపత్‌ నంది సాయి ధరం తేజ్‌ తో గాంజా శంకర్‌ చేయాల్సింది కానీ అది మధ్యలో ఆగిపోయింది.

ఐతే గాంజా శంకర్‌ మిస్సైనా మరో సినిమా లైన్లో పెట్టాడు సంపత్‌ నంది. యువ హీరో శర్వానంద్‌ తో సంపత్‌ నంది సినిమా రాబోతుంది. ఈ సినిమా 1965 బ్యాక్‌ డ్రాప్‌ లో ఉంటుందని తెలుస్తుంది. ఐతే సంపత్‌ నంది సెంటిమెంట్‌ ప్రకారం శర్వా సినిమాలో కూడా తమన్నాని రిపీట్‌ చేస్తాడా అన్నది చర్చల్లో ఉంది. ఓదెల 2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి శర్వానంద్‌ గెస్ట్‌ గా వచ్చి తమన్నాతో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. మరి శర్వాతో చేసే సినిమాకు సంపత్‌ మళ్లీ తమన్నా సెంటిమెంట్‌ రిపీట్‌ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. తమన్నా కూడా వచ్చిన ప్రతి ఛాన్స్‌ కాదనకుండా చేస్తుంది. శర్వానంద్‌ సంపత్‌ నంది సినిమాలో హీరోయిన్‌ గా ఛాన్స్‌ లేకపోయినా తమన్నా కనీసం స్పెషల్‌ సాంగ్‌ కోసం అయినా ఒప్పుకునే ఛాన్స్‌ ఉంటుందని చెప్పొచ్చు.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

హీరో ఛాన్స్‌ కూడా వద్దనుకుని గబ్బర్‌ పాత్రపై మనసు పడ్డ స్టార్‌!
షోలే ప్రీప్రొడక్షన్‌ లో అసలేం జరిగింది..?

షోలే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓ ఐకానిక్‌ ఫిల్మ్‌. ఎప్పటికీ షోలే పేరు పరిశ్రమ ఉన్నంతకాలముంటుంది. పక్కా కమర్షియల్‌ సినిమాకు ఓ మాడల్‌ షోలే. సినిమాలో పాత్రలన్నీ వేటికవే ప్రధాన్యత సంతరించుకుంటే.. వాటిని పోషించిన పాత్రధారులు కూడా అదే స్థాయిలో న్యాయం చేయడం.. 24 క్రాఫ్ట్సూ కుదరడంతో షోలే ఓ బ్లాక్‌ బస్టర్‌ గా నిల్చింది. ఆ పాత్రలన్నింటిలోనూ గబ్బర్‌ సింగ్‌ పాత్రకు దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అందుకే ఆ పాత్రకు అదే స్థాయిలో డిమాండ్‌ కూడా ఏర్పడిరదట. ఎంతగా అంటే.. ఆ సినిమాలో ఓ స్టార్‌ హీరో కూడా తన హీరో పాత్ర కాదని గబ్బర్‌ సింగే కావాలనేంత!

ఏ దోస్తీ హమ్‌ నహీ చోడెంగే అంటూ అమితాబ్‌, ధర్మేంద్ర ఎంట్రీ పాటతోనే ఒక ఊపు తీసుకొచ్చిన షోలేలో.. ఆర్డీ బర్మన్‌ మ్యూజిక్‌ ఎంత మ్యాజిక్‌ చేసిందో.. ఆ సినిమా కథనం.. అందులో మిగిలిన పాత్రలు.. మరీ ముఖ్యంగా హరె ఓ సాంబా అంటూ ఒక వెకిలినవ్వు నవ్వే గబ్బర్‌ సింగ్‌ పాత్ర ఇవన్నీ ఎవర్‌ గ్రీన్‌.

షోలేలో అన్నీ సమపాళ్లల్లో కుదిరినా.. అన్నింటికంటే వావ్‌ అనిపించిన గబ్బర్‌ సింగ్‌ పాత్ర మాత్రం అన్నింటికంటే డిమాండ్‌ సంతరించుకుంది. అయితే, గబ్బర్‌ సింగ్‌ పాత్రకు అమ్జాద్‌ ఖాన్‌ ఎంత సూటయ్యాడు.. ఎంత న్యాయం చేశాడన్నది రెస్ట్‌ ఆఫ్‌ హిస్టరీ అయితే.. అంతకుముందు ఆ పాత్రకోసం రమేష్‌ సిప్పీ మరో ఇద్దరినీ సంప్రదించిన విషయమూ తెలిసిందే.

అందులో ఒకరు డ్యానీ అయితే, మరొకరు రంజిత్‌ సంభావ్య. కానీ, వివిధ కారణాల వల్ల ఆ పాత్రను వారు చేయలేకపోవడంతో అమ్జాద్‌ ఖాన్‌ ను వెతుక్కుంటూ వెళ్లింది గబ్బర్‌ సింగ్‌ పాత్ర. కానీ, తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసి తన సినిమా జీవితంలోనే తన పేరు అమ్జాద్‌ ఖాన్‌ కన్నా కూడా గబ్బర్‌ సింగ్‌ గానే స్థిరపడ్డారు అమ్జాద్‌ ఖాన్‌.

అలాంటి గబ్బర్‌ సింగ్‌ పాత్రను.. షోలేలో ప్రధాన పాత్రధారులైన మరో ఇద్దరు మేం చేస్తామంటే మేం చేస్తామంటూ రమేష్‌ సిప్పీని అడిగారట.

వారిలో ఒకరు సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ అయితే.. మరొకరు సంజీవ్‌ కుమార్‌.

షోలేలో జై పాత్రను అమితాబ్‌ పోషిస్తే ఠాకూర్‌ పాత్రలో సంజీవ్‌ కుమార్‌ ఒదిగిపోయాడు. కానీ, వీరిద్దరూ ఐకానిక్‌ గబ్బర్‌ పాత్రపై మనసుపడ్డారట.

ఈ విషయాన్ని ఈ సినిమా రచయిత సలీంఖాన్‌ తమ గురించి తీసిన వెబ్‌ సీరీస్‌ యాంగ్రీ యంగ్‌ మెన్‌- ది సలీం జావేద్‌ స్టోరీ ప్రమోషన్‌ లో భాగంగా షేర్‌ చేసుకున్నారు.

ధర్మేంద్ర మాత్రం తనకు ఇచ్చిన వీరు రోల్‌ గురించి చాలా సంతోషంగా కనిపించేవాడని.. కానీ, అమితాబ్‌, సంజీవ్‌ కుమార్‌ లో మాత్రం గబ్బర్‌ పాత్ర పోషించాలనే క్యూరియాసిటీ సినిమా మొత్తం కనిపించిందంటారు సలీంఖాన్‌. అంతగా ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులను కూడా గబ్బర్‌ పాత్ర ప్రభావితం చేసిన ఘటనలను ఆయన గుదిగుచ్చారు.

అయితే, ఆ పాత్రను గబ్బర్‌ సింగా అమ్జాద్‌ఖాన్‌ నభూతో అన్నట్టుగా చేయడంతో.. అమ్జాద్‌ ఖాన్‌ మాత్రమే చేయగలడన్నట్టుగా ఆ తర్వాత ఆయన పేరు మారుమోగింది.

అసలు గబ్బర్‌ పాత్రెలా సృష్టించబడిరది..?

మధ్యప్రదేశ్‌ భిండ్‌ జిల్లా డాంగ్‌ కు చెందిన గబ్రా. 24 ఏళ్లకే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేసిన బందిపోటుగా ఎదిగాడు. ఆ కాలంలోనే అతడిపై 50 వేల రూపాయల రివార్డును ప్రకటించింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. గబ్రా క్యారెక్టర్‌ కూడా చాలా భిన్నమైంది. ఎంత క్రూరుడో అంత భక్తిపరుడు. అయితే, ఆభక్తిలోనూ తన క్రూరత్వాన్ని చాటేవాడు. అలా లక్ష్మణుడు శూర్పణక ముక్కూ, చెవులు కోసినట్టు.. 116 మంది పోలీసుల ముక్కులు, చెవులు కోసి తన కులదైవానికిచ్చాడట. అంతటి క్రూరత్వమున్న క్యారెక్టర్‌ అప్పట్లో హాట్‌ టాపిక్‌ కావడంతో.. దాన్నే తమ కథలో విలన్‌ కు స్ఫూర్తిగా తీసుకున్నారు రచయితలు సలీం-జావేద్‌. దాన్నే మరింత సినిమాటిక్‌ గా మార్చి షోలే సినిమాలో ఆ పాత్రను హైలెట్‌ గా మార్చేశారు.

-బాతాఖానీ.కామ్‌ సౌజన్యంతో...


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page