నాగావళిలో గుర్తుతెలియని మృతదేహం
- BAGADI NARAYANARAO
- Feb 19
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలోని నాగావళి నదిలో హయాతినగరం వైపు గుర్తు తెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతదేహం కుళ్లిన స్థితిలో గుర్తు పట్టనట్టుగా ఉండడంతో వివరాలు లభ్యం కావడం లేదని ఒకటవ పట్టణ పోలీసులు తెలిపారు. మృతుని వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. మృతదేహం ఎడమ చేతిపై మహిళ బొమ్మ, అక్షరాలు పచ్చబొట్టు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక వీఆర్వో సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం పరిశీలించారు. వ్యక్తి మృతి చెంది నాలుగు రోజులు అయి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువులు ఎవరైనా ఉంటే సమాచారం కోసం ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌కు రావాలని పోలీసులు తెలిపారు.
Comments