top of page

న్యాయంపై నమ్మకం పోతోంది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 28
  • 2 min read

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా కోర్టు మెట్లెక్కుతారు. అది భారత రాజ్యాగం కల్పించిన హక్కు. పాలకులు, అధికారులు, పోలీసులు చేయలేనిది కోర్టు చేస్తుందనే నమ్మకం. ఆ నమ్మ కమే అపనమ్మకమైతే? అధికారంతో కుమ్మక్కయితే? అవినీతిలో కూరుకుపోతే? ఇలాంటివన్నీ నేడు పౌర సమాజాన్ని వేధిస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే, న్యాయంపై నమ్మకం సన్నగిల్లే ఓ అవినీతి బండారం ఢల్లీి హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ ఇంట్లో బయటపడిరది. ఆయన అధికారిక నివాసంలో దొరికిన నోట్ల కట్టల మూట అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయ మూర్తులతో అంతర్గత కమిటీ వేసింది. ఢల్లీి హైకోర్టు రిజిస్ట్రీ అయితే ఆయన్ను విధులకు దూరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. కొలీజియం సమావేశమై వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేస్తు న్నట్టు ప్రకటించింది. ఈ విధంగా శరవేగంగా జరుగుతున్న పరిణామాలు, టీవీల్లో, మాధ్యమాల్లో వర్మ వ్యవహారంపై నడుస్తున్న చర్చలు ఒకరకంగా న్యాయవ్యవస్థకే పెను కళంకాన్ని తెచ్చిపెట్టాయి. అసలేం జరిగింది? ఎలా జరిగింది? అన్న అంశాలకంటే న్యాయవ్యవస్థలో ఏం జరుగుతుందన్నది అలోచించడం చాలా ముఖ్యం. మార్చి 14న ఢల్లీిలోని యశ్వంత్‌వర్మ నివాసంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించడం తో స్టోర్‌ రూమ్‌లోని అనేక వస్తువులతో పాటు కోట్ల రూపాయలు కాలిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాథమికంగా విచారణ చేపట్టిన ఢల్లీి పోలీస్‌ కమిషనర్‌ సంజరు అరోరా మాత్రం జడ్జి ఇంటి ఆవరణలో సగం కాలిన నోట్లు, ఇతర శిథిలాలను తర్వాత రోజు తొలగిస్తున్న దృశ్యాలను ఆధారాలతో సహా ఛీఫ్‌ జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. వర్మ నివాసంలో నగదు ఫొటోలు, వీడియోిలతో సహా అంతర్గత విచారణ నివేదికను సమాచారం నిమిత్తం ఈ నెల 22న సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొం టున్న జస్టిస్‌ వర్మ మాత్రం డబ్బు దొరికిన విషయం ధృవీకరించడం లేదు. ‘అగ్ని ప్రమాద సమయంలో మేము భోపాల్‌లో ఉన్నామని, డబ్బు సంచులు అక్కడికి ఎలా వచ్చాయో, నేను ఇంతవరకు చూడలేదని’ చెప్పారు. అంతేకాదు, దీన్ని కుట్రగా అభివర్ణించారు. తనపై వచ్చిన అభియోగాలపై హుందాగా విచారణ ఎదుర్కోవాల్సిన వ్యక్తి దాన్ని విస్మరిస్తూ మాట్లాడటం విచిత్రం. దీన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా విచారణ చేస్తుండగానే అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సీజేఐకి ఓలేఖ రాసింది. అది న్యాయవ్యవస్థలోనే పెను దుమారాన్ని రేపింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్వంత్‌ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారని ఆ లేఖలో ప్రశ్నించింది. ఆ ‘చెత్త’ మాకొద్దంటూ తీవ్ర పద జాలాన్ని ప్రయోగించింది. బార్‌ వాదనను పరిశీలిస్తే గనుక వర్మ అక్కడ కూడా ఇలాగే ఉన్నారన్న అను మానం కలగకమానదు. లెక్కలేని డబ్బు బయటపడిన నేపథ్యంలో వర్మ గతంలో ఇచ్చిన తీర్పులన్నీ మరో సారి విచారించాలనే వాదన కూడా నెటిజన్ల నుంచి వస్తున్నది. ఎంతోమంది దోషులను నిర్దోషులుగా మారి స్తేనే ఈ డబ్బు నజారానా వచ్చిందనే విమర్శలకు దొరికిన నగదు బలాన్ని చేకూరుస్తున్నది. ఈ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. జడ్జి ఇంట్లో కరెన్సీ కట్టలు దొరికిన అంశంపై చర్చించాలని సీపీఐ(ఎం) ఎంపీ శివదాసన్‌తో సహా ప్రతిపక్షాలు నోటీసులు జారీచేశాయి. పాలక పక్షం ఈ అంశంపై చర్చించకపోగా ఉనికిలో లేని అంశాల్ని ముందుకు తెచ్చి అసలు విషయాన్ని దాట వేసింది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేసే న్యాయవ్యవస్థ ఈ విధంగా దిగజారడం సామాన్యు లను సైతం కలవరపరుస్తున్నది. ప్రస్తుత పెట్టుబడిదారి సమాజంలో డబ్బే కేంద్రంగా ఉంది. అది అవినీతి గా మారి ప్రజాస్వామ్య మౌలిక విభాగాలన్నింటినీ విస్తరించింది. దాన్ని తగ్గించే కృషి చేయాల్సిందిపోయి బలోపేతంచేసే పాలన దేశాన్ని నడిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం ఏ విధంగా సామాన్యుడికి అందుతుంది? దశాబ్దకాలంగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. తమకు అనుకూలమైన తీర్పునిచ్చినందుకు జస్టిస్‌ రంజన్‌ గగోరుని రాజ్యసభ పదవిని కట్టబెట్టగా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పదవీ విరమణ కాగానే గవ ర్నర్‌ బహుమతిని అందుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో స్వతంత్ర హోదాలో పనిచేయాల్సిన న్యాయ వ్యవస్థ పారదర్శకత పాటించడం, ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం సాధ్యమేనా? అందుకే ‘న్యాయం గెలుస్తుందన్నమాట నిజమేకానీ.. గెలిచేదంతా న్యాయం కాదు’ అంటారు శ్రీశ్రీ. జస్టిస్‌ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలపై సమగ్ర విచారణ చేసి నిజాల్ని వెల్లడిరచాలి. అధికారంలో ఉన్నవారు న్యాయ విలువల్ని కాపాడాలి. లేదంటే నేడు వర్మ గురించి మాట్లాడుకున్నట్టే, రేపు ఇంకొకరి గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page