పాక్ తెర మీద భారత్ సినిమా!
- DV RAMANA
- Mar 18
- 2 min read

2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిలో మన సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా వద్ద కారుతో ఆత్మాహుతి బాంబుదాడి జరిగింది. ఇందులో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు మరణించిన విషయం గుర్తుంది కదా..! ఇప్పుడు ఇదే సీన్ పాకిస్తాన్ గడ్డ మీద జరిగితే ఎలా ఉంటుందో చూపించారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. టేబుల్ మారింది.. వడ్డించేవాడు మారాడు అంతే. వంటలు మారలేదు.. వండేవాడు మారాడు. 2014 వరకూ కాశ్మీర్ టేబుల్ మీద పాకిస్థాన్ మనకి వడ్డిస్తూ వచ్చింది. 2015 నుంచి పాకిస్తాన్ టేబుల్ మీద మనం వడ్డిస్తున్నామ్. బీఎల్‌ఏ ఆదివారం మధ్యాహ్నం పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ మీద ఆత్మహతి దాడి చేసి 90 మంది సైనికులని హతమార్చింది. మొత్తం 8 ప్రయాణీకుల బస్సులు ఒక దాని వెనుక ఒకటిగా టఫ్తాన్ వైపుగా ప్రయాణిస్తున్న సమయంలో నోష్కి అనే ప్రాంతం దగ్గరికి వచ్చే సరికి రోడ్డు పక్కగా పార్క్ చేసి ఉన్న కారు ఒక్కసారిగా బస్సు మీదకి దూసుకువచ్చి పేలిపోయింది. బస్సుల్లో ఉన్న పాకిస్తాన్ ఫ్రాంటియర్ ఫోర్స్‌కి చెందిన సైనికులు మరణించారు. బీఎల్‌ఏ చాలా పకడ్బందిగా ప్లాన్ వేసి దాడి చేసింది. బీఎల్‌ఏలో రెండు విభాగాలు ఉన్నాయి. ‘మజీద్ బ్రిగెడ్’.. ఇది ఫిదాయి (ఆత్మాహుతి) విభాగం. అవసరం అయినప్పుడు బలూచిస్తాన్ కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండే యువకులతో ఉంటుంది. నిన్నటి దాడికి పాల్పడిరది మజీద్ బ్రిగెడ్ సభ్యులే. ఒక కారులో పేలుడు పదార్ధాలు నింపి బస్సు దగ్గరికి రాగానే నేరుగా బస్సుని గుద్ది పేలుడు పదార్ధం పేల్చేసి విధ్వంసం సృష్టించాడు. బస్సు పేలిపోగానే వెంటనే ‘ఫతే స్క్వాడ్’ సభ్యులు వెనుక వస్తున్న బస్సు మీద కాల్పులు జరిపి బస్సులో ఉన్న సైనికులు అందర్నీ చంపేశారు. ఫతే స్క్వాడ్ చేతుల్లోని ఎం`4 అసల్ట్ రైఫిల్స్ 2020లో అమెరికా సైన్యం కాబూల్ ఎయిర్‌బేస్‌లో వదిలిపెట్టినవే. అమెరికన్ ఆర్మీ దాదాపుగా 6వేల ఎం`4 అసాల్ట్ రైఫిల్స్, బులెట్స్ మ్యాగజైన్స్‌తో సహా వదిలివెళ్లింది. సో.. ట్రంప్ మా ఆయుధాలు మాకిచ్చేయండి అని డిమాండ్ చేసింది నర్మగర్భంగా మేము చెప్పిన వాళ్లకి ఇవ్వండి అని అర్ధం చేసుకోవాలి. మొన్నటి దాడిని పరిశీలిస్తే ఇరాక్‌లో ఐసీస్ టెర్రరిస్టులు అమెరికన్ సైన్యం మీద చేసిన దాడులని గుర్తుకు తెస్తు న్నాయి. ఉన్నట్లుండి ఐసీస్ టెర్రరిస్టులు చిన్న కారులో వచ్చి యుద్ధ టాంక్‌ని గుద్ది పేల్చేవాళ్లు వెంటనే మరో గ్రూపు వెనుక ఉన్న టాంక్ మీదకి గ్రానెడ్స్‌తో దాడి చేసి ముందు పేలుడుకి గురైన టాంక్‌కి సపోర్ట్ అందకుండా చేసి చివరికి రెండు టాంక్‌లని, అందులో ఉన్నవాళ్లని చంపేసేవారు. ముఖాముఖీ పోరులో కంటే చిన్న చిన్న గెరిల్లా ఫైట్స్‌లోనే ఎక్కువమంది అమెరికన్ సైనికులు చనిపోయారు. నిన్నటి బీఎల్‌ఏ దాడి కూడా ఇరాక్‌లో జరిగిన దాడిలాంటిదే. అసలు 8 బస్సుల్లో ఫ్రాంటియర్ ఫోర్స్ (పారా మిలిటరీ)ని టఫ్టాన్‌కి ఎందుకు తరలిస్తున్నట్లు? తఫ్టాన్ అనేది పాకిస్థాన్ ఇరాన్ సరిహద్దులో ఉన్న పట్టణం. బీఎల్‌ఏని బలూచిస్థాన్ నుంచి ఇరాన్ బోర్డర్ వరకూ తరిమేసి తఫ్టాన్ దగ్గర నుంచి ఇరాన్ లోకి పారిపోకుండా అక్కడ సైనికులు ముందే ఉంటారు కాబట్టి ముందుకు వెళ్లినా లేదా వెనక్కి వచ్చినా పాకిస్తాన్ సైన్యం చేతిలో బీఎల్‌ఏ ఫైటర్లు చనిపోవాల్సిందే. అందుకే ముందుగా 500 మంది సైనికు లని టఫ్తాన్‌కి పంపించాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్ సైన్యం. మిలిటరీ ట్రక్కులు అయితే తెలిసిపోతుంది కాబట్టి సాధారణ ప్రయాణీకుల బస్సుల్లో తరలించింది. కానీ ఎవరో ప్లాన్ లీక్ చేశారు బీఎల్‌ఏకి. ప్లాన్ లీక్ అయ్యింది కాబట్టే హైవే మీద కాపుకాసి మరీ దాడి చేయగలిగింది బీఎల్‌ఏ. దాడి చేసిన దృశ్యాలని పాకిస్తాన్‌లోని మీడియాకి తప్ప భారత్, మధ్యప్రాచ్యంలోని మీడియా హౌస్‌లకి వీడియోతో వివరంగా దాడి ఘటనలని మెయిల్ చేసింది బీఎల్‌ఏ. ప్రస్తుత బీఎల్‌ఏ దాడులు ఇరాక్‌లోని పరిస్థితులని గుర్తుకు తెస్తున్నాయి. సద్దాంహుస్సేన్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఇరాక్‌లో డాలర్‌కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేదికాదు. అమెరికా ఇరాక్ మీద ఆంక్షలు విధించాక ఇరాక్ కరెన్సీ తన విలువ కోల్పోయింది. దాంతో వ్యాపార సంస్థలు డాలర్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇరాక్‌లో డాలర్‌కి డిమాండ్ పెరిగాక సీఐఏకి డాలర్లు తీసుకొని సమాచారం ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. ఒక దశలో ఇరాక్ ఇంటెలిజెన్స్ అధి కారులు కూడా వేలకొద్ది డాల్లర్లకి ఆశపడి కీలకమైన సమాచారాన్ని సీఐఏకి అమ్ముకున్నారు. సద్దాం పతనానికి కారణం డాలర్ మీద ఉన్న ఆశ కూడా ప్రముఖ పాత్ర వహించింది. ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి కూడా ఒకప్పటి ఇరాక్ పరిస్థితికి భిన్నంగా లేదు. ముఖ్యమైన ఆపరేషన్ సమాచారం రెండు రోజుల ముందే బీఎల్‌ఏకి దొరికి ఉండవచ్చు లేకపోతే ముందస్తు ఏర్పాట్లుచేసుకొని దాడికోసం ఎదురుచూడరు.
コメント