పవన్‌ను నాయకుడ్ని చేసింది జగనే
- DV RAMANA
- Mar 17
- 2 min read

అతనితో పోలిస్తే పేదవాడైన పవన్‌కళ్యాణ్ పార్టీని నడపడం కష్టమైన పనైనా బాగానే నడుపుకుంటూ వస్తు న్నారు. రాష్ట్రంలోని ఇతర కులపార్టీల లానే ఒక కుల పార్టీలా మొదలైన ఆ పార్టీ ఈ రోజు ఒక మత పార్టీగా రూపాంతరం చెందింది. ఇంత ప్రగతిని జనసేన సాధించింది అంటే.. దానికి కారణం ఆ పార్టీనీ వెన్నంటి ప్రోత్సహిస్తున్న జగన్, వైకాపా అభిమానులే. వారి అండదండలే లేకపోతే పవన్ 2019లో ఏదో ఒకచోట ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చి అక్కడ ఏం చేయాలో తెలియక, పార్టీని నడిపే డబ్బు లేక ఎప్పుడో రాజకీయాలు వదిలేసే వుండును. తన తండ్రి సొంత పార్టీ ఎమ్మెల్యేలైన పి.జనార్ధనరెడ్డి, డి.శ్రీనివాస్‌లను ఓడిరచి తనకు అడ్డు లేకుండా చూసుకుంటే పాపం జగన్ పక్క పార్టీ నాయకుణ్ణి ఓడిరచి తనకి అతగాడు అడుగడుగునా అడ్డుతగిలేలాగా చేసుకున్నారు. ఇక జగన్ కంటే ఎక్కువగా ఆయన పార్టీ నాయకులు, అభిమానులు నిత్యం పవన్ నామస్మరణ చేసి చేసి పవన్ ఇమేజ్‌ను కొండంత ఎత్తుకు పెంచారు. ఇపుడు జగన్ క్రిస్టియన్లకి బ్రాండ్ అంబాసిడర్ అవునో కాదో తెలీదు కానీ పవన్‌ని మాత్రం హిందువులకు బ్రాండ్ అంబాసిడర్‌ని చేసేసారు. ఇది వ్యంగ్యంగా చెబు తున్న మాట కాదు, రాజకీయాల్లో శత్రువులు ఎక్కడి నుంచో పుట్టరు. తమ తప్పుడు నిర్ణయాలతో శత్రువులను ఆ నాయకులే సృష్టించుకుంటారు. ఆ రోజు సీబీఐ విజయరామారావుకి మంత్రి పదవిచ్చి కేసీఆర్‌ని తయారుచేసింది చంద్రబాబే కదా. నాలుగడుగుల రేవంత్ రెడ్డిని ఎవరెస్ట్ ఎత్తుకు పెంచింది కేసీఆర్ అండ్ కేటీఆర్ కాదూ? పాపం అక్కడ అధినాయకులు ఒక్కరివే తప్పులైతే ఇక్కడ అతనితో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మాజీ అభిమానులు, ఆయన తండ్రి అభిమానులు, ఇలా ఒక్కరు కాదు, వైకాపాతో బీరపీచు సంబంధం వున్న ప్రతిఒక్కరూ పవన్ ఎదుగుదలకు శక్తిమేర తొడ్పడుతూనే వున్నారు. నిజానికి టీడీపీలో ఎవరూ పవన్ ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోరు. వైకాపా వారి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో వైకాపా ‘అత్యంత ప్రజాస్వామ్య’ పద్ధతుల్లో ఏకగ్రీవం చేసుకునే రోజుల్లో వారికి రోడ్డు మీద ఎదురు తిరిగింది కేవలం జనసేన వాళ్లు మాత్రమే. కానీ ఈ రోజు పదిమంది టీడీపీ అభిమానుల్ని ప్రైవేట్‌గా ప్రశ్నిస్తే వారిలో పదికి పదిమందీ మా వలననే పవన్ గెలిచారు అంటారు. వారి కట్టుబాటు అది. వారితో పోలిస్తే పవన్‌ని అనునిత్యం గేలిచేస్తూ అతని ఎదుగుదలకు నిస్వార్థంగా కృషి చేస్తున్న వైకాపా అభిమానులని అభినందించక తప్పదు. పవన్ సక్సెస్ ఫార్ములా అదే. ఎలాగోలా అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ప్రవర్తించిన టీడీపీ ఇప్పుడు తన చావు తాను తెచ్చుకుంటోంది. చివరకు బీజేపీకి తలొగ్గకపోతే అధికారం పోతుందనే భయంతో తానే బీజేపీలా మాట్లాడే పరిస్థితికి టీడీపీ పడిపోతోంది. ఇంతకాలం దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టడానికి వీళ్లేని పరిస్థితిని జయించడానికి బీజేపీకి సరైన తురుపుముక్క పవన్‌కల్యాణ్. ఇక నుంచి దక్షిణభారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల అధికార భాషలు ఎంతోకొంత వంట బట్టించి హిందీ పేరుతో పవన్‌కల్యాణ్‌తో పర్యటన చేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. అందుకే ఇటీవల తమళనాడు నేతల మీద పవన్‌కల్యాణ్ విమర్శలు చేసి దక్షిణాదిలో బలమైన రాష్ట్రాన్ని కెలికారు. నిజానికి ఎంతోకొంత సెక్యులర్ స్వభావం ఉన్న టీడీపీ వల్ల తమ ప్రయోజనం నెరవేరదని భావించిన బీజేపీ పవన్‌కల్యాణ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో తన వంతు వేగాన్ని పెంచడం ప్రారంభించింది. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ అవసరం తప్పనిసరి పరిస్థితి పవన్‌కల్యాణ్ ద్వారా బీజేపీ కల్పిస్తోంది. పవన్‌కల్యాణ్ సినీ అభిమానాన్ని రాజకీయ రంగు చేసి పబ్బం గడుపుకోడానికి రెండు తెలుగు రాష్ట్రాలను హిందూ ప్రయోగశాలగా మార్చడానికి చేసే ప్రయ త్నాలకు అధికార ప్రతినిధిగా పవన్ కల్యాణ్ మాస్‌లోకి వెళ్లబోతున్నారు. మెజార్టీగా ఇక్కడ క్రైస్తవం హైందవ భావాలతో ప్రభావితమైవుంది. కామన్‌మేన్ ప్రొటక్షన్ ఫోరం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వరకు పవన్‌కల్యాణ్ అన్ని రాజకీయ పార్టీలను టచ్ చేస్తూ కొన్నేళ్లు కాలక్షేపం చేస్తే, ఆయన్ను పూర్తిస్థాయి రాజకీయవేత్తగా మలిచింది మాత్రం జగన్మోహన్‌రెడ్డే.
Comentarios