మానవత్వం రోడ్డున పడింది!
- DV RAMANA
- Mar 22
- 1 min read
వారం రోజులుగా రోడ్లపై అభాగ్యుడు
ఏమాత్రం పట్టించుకోని సేవాసంస్థలు
ప్రచారం తప్ప సేవానిరతి ప్రశ్నార్థకం
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఇప్పుడంతా కలికాలం. నేను, నాది.. అన్న స్వార్థం తప్ప మనిషి ఇంకేమీ ఆలోచించిడం లేదు. తన పక్కన, తన చుట్టుపక్కల ఏం జరుగుతోందో కనీసం పట్టించుకోవడంలేదు. గతంలో పక్కవారు ఇబ్బందుల్లో ఉంటే చేతనైనంత సాయం చేసేవారు. రోడ్డు మీద ఎవరైనా నిస్సహాయ స్థితిలో కనిపిస్తే అయ్యో పాపం.. అని చేయూతనందించేవారు. కానీ ఇదంతా గతకాలపు ముచ్చట. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించదు. దానికి ఈ ఫొటోయే నిలువెత్తు నిదర్శనం. మానవత్వం మరణించిందనడానికి నజీవ తార్కాణం.

ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడు వారం రోజులుగా ఇదే దుస్థితిలో నగరంలోని పలు రోడ్లలో కనిపిస్తున్నాడు. ప్రధాన రోడ్ల పక్కనే దీనస్థితిలో కనిపిస్తున్న ఆ వృద్ధుడిని ఆ మార్గాల్లో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పాపాన పోవడంలేదు. కనీసం ఒక్క క్షణం ఆగి.. వృద్ధుడి పరిస్థితి ఏమిటని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ ఫొటో చూసి.. వృద్ధుడి వాలకం చూసి.. అతని పిచ్చివాడేమోనని అనుకోవచ్చు. కానీ అతని మానసిక స్థితి సవ్యంగానే ఉంది. తాగుబోతు అని కూడా అనుకునే అవకాశం ఉంది. కానీ తాగుబోతు కాదని చెప్పవచ్చు. తాగుబోతులైతే డబ్బులు ఉంటే చాలు శరీరంలో సత్తువ లేకపోయినా పాక్కుంటూ వెళ్లి అయినా మద్యం కొని తాగేస్తారు. కానీ ఇతగాడు ఆ పని చేయడంలేదు. పోనీ బిచ్చగాడు అనుకుందామా అంటే.. ఆ భావనతో ఎవరైనా డబ్బులు వేసినా వాటిని కనీసం ముట్టుకోవడం లేదు. ఎవరి తాలూకానో.. ఎక్కడి నుంచి వచ్చాడో గానీ.. గత వారం రోజులుగా నగరంలోని జీటీ రోడ్డు, న్యూకాలనీ తదితర ప్రధాన రోడ్లలోనే కనిపిస్తున్నాడు. తిండీతిప్పలు లేకుండా రోడ్డు పక్కనే పడి ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
నగరంలో వందల సంఖ్యలో సేవాసంస్థలు ఉన్నాయి. ఆభాగ్యులను చేరదీసి ఆశ్రయం కల్పించే సంస్థలూ ఉన్నాయి. కానీ వాటి నిర్వాహకులెవరి దృష్టీ ఈ అభాగ్య వృద్ధుడిపై పడకపోవడం శోచనీయం. స్వచ్ఛంద సేవా సంస్థల పేరుతో కేవలం పళ్లు ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటుంటారు. చివరికి నడక వ్యాయామం చేసుకునే వాకర్స్ కూడా సేవ పేరుతో ఇటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఏ సంస్థా, ఏ స్వచ్ఛంద సేవకుడు కూడా ఈ వృద్ధుడిపై దయచూపలేదు. తాము సహాయం చేయకపోయినా కనీసం అతనికి ఆసరా ఇచ్చి నగరంలోని అభాగ్యుల ఆశ్రయ కేంద్రానికి తరలించి కాసింత నీడ కల్పించాలన్న ఆలోచన కూడా చేయకపోవడం ఈ సేవాతత్పరులకు సేవానిరతికి ఘనమైన నిదర్శనం. ఇదంతా చూస్తుంటే మానవత్వమా నువ్వెక్కడ..? అని ప్రశ్నించుకోవాల్సిన దుస్థితి.
అయితే సత్యం వారు వార్తే వేశారా లేదా ఆయనను హోం కి తరలించార