మార్కెటింగ్ ఫార్ములాతో ‘అబ్బా’ అనిపించాడు
- Guest Writer
- Mar 19
- 2 min read

తెలుగు ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ సినిమాలతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరంకి సడెన్ హిట్ తో పెద్ద బ్రేక్ వచ్చింది ‘‘క’’ అనే సినిమాతో, గత సంవత్సరం దీపావళికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంతకు ముందు సినిమా ‘‘రూల్స్ రంజాన్’’ చూశాక ఇతని మీద ప్రేక్షకులు పూర్తిగా నమ్మకం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిరది. ముందుగా ఇతన్ని హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి, అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా పక్కన పెట్టేసింది.
దాంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి కొన్ని నెలల బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత జాగ్రత్తగా, శ్రద్ధగా ‘క’ సినిమా సబ్జెక్ట్ స్టడీ చేసి, ఇద్దరు దర్శకులతో ఆ సినిమా తీసి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇతడు సక్సెస్ బాటలో పడ్డాడనే అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఇదే ‘‘క’’ సినిమాని మళయాళంలో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కు డబ్బింగ్ రైట్స్ అమ్మేసారు. అక్కడ రిలీజై మళ్లీ ఫెయిల్యూర్ అయ్యాడు. ఐతే ఇప్పుడు న్యూ రిలీజ్ ‘‘దిల్ రూబా’’ సినిమాతో మళ్లీ తను పాత బాటలోకే వెళ్లిపోయినట్లే అనిపించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మళ్ళీ పాత రోజులే గుర్తుకు వచ్చాయి. ‘‘క’’ తర్వాత కిరణ్ ఇలాంటి సినిమా తీసాడేంట్రా బాబూ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక్కడ జరిగిన వాస్తవం ఏమిటంటే..? ‘‘క’’ కంటే ముందే చేసిన సినిమా ‘‘దిల్ రూబా’’ అయితే దాన్ని మధ్యలో ఆపి, ‘‘క’’ సినిమా తీసి దాంతో మంచి ఫలితాన్నందుకున్నాడు. తన కెరీర్ లో అంతకుముందున్న దారుణమైన ఫ్లాప్ ల్లానే ‘‘దిల్ రూబా’’ సినిమా కూడా రిలీజై ఉంటే..! ఆ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా వచ్చేవి కావు. పైగా తన కెరీర్ మైనస్ అయ్యేది. అతను అదే సమయంలో ‘‘క’’ తన కెరీర్‌ను మలుపు తిప్పగలదని నమ్మి దాన్ని ముందుగా రిలీజ్ చేశాడు.
‘‘క’’ సక్సెస్ వల్ల కిరణ్ మీద ప్రేక్షకులకే కాదు, ఒక సంస్థకు కూడా మంచి నమ్మకం కుదిరింది కాబట్టే ‘‘దిల్ రూబా’’ సినిమాను వాళ్లు కొని రిలీజ్ చేశారు. తద్వారా నిర్మాతలు సేఫ్ అయిపోయారు. సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ట్రైలర్ బాగా సెట్ చేయడం, ప్రీరిలిజ్ ఈవెంట్ చేసి బైక్ గిఫ్ట్ లాంటివి పెట్టి ప్రమోషన్ లో భాగంగా చక్కగా అన్నీ వాడుకున్నారు. దాంతో పాటు ‘‘క’’ తాలూకు పాజిటివిటీ ‘‘దిల్ రూబా’’కు జత కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. ముందు రెడీ అయింది కదా అని..!
‘‘క’’ కంటే ముందే ‘‘దిల్ రూబా’’ను రిలీజ్ చేసి ఉంటే అతని కథ ఇంకోలా ఉండేది. ఈ సినిమాకు బిజినెస్ అండ్ బజ్ క్రియేటయ్యేది కాదు, ఓపెనింగ్స్ కూడా వచ్చేవి కావు. మొత్తంగా ‘‘దిల్ రూబా’’ హోల్డ్‌లో పెట్టి ‘‘క’’ పూర్తిచేసి రిలీజ్ చేయడం తెలివైన ఎత్తుగడ వేసాడు. కాబట్టే ‘‘దిల్ రూబా’’ను సేల్ చేసి మార్కెట్ చేయగలిగాడు కిరణ్ అబ్బవరం.ఇదీ మార్కెటింగ్ స్ట్రాటజి అంటే..!
అశోక్ పోతురాజు
‘విశ్వంభర’పై చిరు క్లారిటీ

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ విషయంలో మెగా ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్ ఇంకా పోలేదు. ఏప్రిల్ లో ఈ సినిమా రావాలి. ఆ తరవాత మే 9 అన్నారు. ఈ రెండు డేట్లూ పోయినట్టే. వేసవిలో ఈ సినిమా రాదన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఎప్పుడొస్తుంది? ఆగస్టు 22 సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తే బాగుంటుందన్నది యూవీ క్రియేషన్స్ ఆలోచన.
చిరంజీవి కూడా ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ గురించి ఏమాత్రం కంగారు పడడం లేదు. వీఎఫ్‌ఎక్స్ తో పెట్టుకొంటే పనులు ఓ పట్టాన తెవలవు అని ఆయనకు కూడా బాగా తెలుసు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయిపోయిన తరవాత, వీఎఫ్‌ఎక్స్ చూసుకొని, అన్ని విధాల సంతృప్తి పడిన తరవాతే.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దామని చిరు చెప్పారట. కాబట్టి%ౌ% నిర్మాతలకూ కంగారు లేదు. కాకపోతే పెరిగిపోతున్న వడ్డీ రేట్లు భరించడం కొంత కష్టమే. హిందీ రైట్స్ రూపంలో యూవీకి మంచి రేటే వచ్చింది. ఇక శాటిలైట్ డీల్ క్లోజ్ చేయాల్సివుంది. ఇది వరకు విశ్వంభరని లైట్ తీసుకొన్న ఓటీటీ సంస్థలు ఇప్పుడు బేరాలకు దిగాయని, మంచి రేటు వస్తే, డీల్ క్లోజ్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఓ పాట మినహా షూటింగ్ కూడా పూర్తయినట్టే. అది ఐటెమ్ సాంగ్. ఆ పాట ఎవరితో చేయించాలి? అనే విషయంలో చిత్రబృందం మల్లగుల్లాలు పడుతోంది. ఎలాగూ%ౌ% కావల్సినంత టైమ్ వుంది కదా. రిలీజ్‌కు ముందు ఈ పాట పూర్తి చేసినా చాలు.
త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ ఆల్బమ్ లో 6 పాటలు ఉంటాయని తెలుస్తోంది. అందులో ఆంజనేయుని గీతం కూడా వుందని, ఆ పాటని ఓ మంచి ముహూర్తం చూసుకొని విడుదల చేస్తారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
Comments