top of page

యాక్టర్‌.. ఇప్పుడు డాక్టరైంది!

  • Guest Writer
  • Mar 27
  • 1 min read

టాలీవుడ్‌ బాలీవుడ్‌లో శ్రీలీల పేరు మార్మోగుతోంది. కోలీవుడ్‌లోను అడుగు పెడుతోంది. నేటితరంలో అరుదైన ఎనర్జీ డ్యాన్స్‌ స్కిల్‌ ఉన్న ప్రతిభావంతురాలిగా శ్రీలీలకు గుర్తింపు దక్కింది. ఈ భామ తదుపరి ‘రాబిన్‌హుడ్‌’తో ప్రేక్షకులను అబ్బురపరచనుంది. ఈ సినిమా తన కెరీర్‌లో గొప్ప వినోదాత్మక చిత్రమని శ్రీలీల చెబుతోంది. నితిన్‌తో కలిసి పనిచేయడం ఇది రెండవసారి. రాబిన్‌ హుడ్‌లో శ్రీలీల ఎన్నారై యువతి నీరా వాసుదేవ్‌గా నటించింది. అందం ఆకర్షణ విచిత్రాలతో నిండిన నీరా ఈ ప్రపంచం తన చుట్టూ తిరుగుతుందని నమ్ముతుంది. ఇలా ఊహించుకుంటూ ఆనందంగా గడిపేస్తుంటే అప్పుడు తనకు ఎదురైనవాడు ఎలాంటివాడు? అన్నది తెరపైనే చూడాలి.

నిజానికి ఈ పాత్రలో రష్మిక మందన్నను నటింపజేయాలని దర్శకుడు భావించారు. కానీ ‘పుష్ప`2’ కమిట్‌మెంట్‌ల కారణంగా రష్మిక దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీలీలను ఈ అరుదైన అవకాశం వరించింది. ఆసక్తికరంగా రష్మిక నటించిన పుష్ప`2లో శ్రీలీల కిసిక్‌ అనే ప్రత్యేక గీతంలో నర్తించిన సంగతి తెలిసిందే. శ్రీలీల ఎనర్జిటిక్‌ డ్యాన్సులకు యూత్‌ ఫిదా అయింది. శ్రీలీల ఇంతకుముందు ఏడాది పాటు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ అది కారణం లేకుండా కాదు. 2023లో చాలా బిజీగా గడిపిన ఈ బ్యూటీ పెండిరగ్‌ షూటింగ్‌లు పూర్తి చేసి, ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యను కొనసాగించింది. స్టడీస్‌పై శ్రద్ధ పెట్టేందుకు గ్యాప్‌ తీసుకుంది. ఎట్టకేలకు దీనికి మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు చేతిలో డిగ్రీతో శ్రీలీల ఆనందంగా ఉంది. గతంలో కంటే ఎక్కువ నమ్మకంగా ఉత్సాహంగా ఉంది. ఇకపై శ్రీలీలను డాక్టరమ్మ శ్రీలీల అని పిలవొచ్చు. శ్రీలీల కొంత విరామం తర్వాత ఇప్పుడు రాబిన్‌హుడ్‌తో తిరిగి రాబోతోంది. తదుపరి శ్రీలీల లైనప్‌ చాలా పెద్దదిగానే ఉంది. అటు తమిళ చిత్రం ‘‘పరాశక్తి’’లో శివకార్తికేయన్‌ సరసన నటిస్తోంది. రవితేజతో ‘మాస్‌ జాతర’లో అవకాశం అందుకుంది. మరోవైపు బాలీవుడ్‌లో క్రేజీగా ఆషిఖి 3లోను నటిస్తోంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

댓글


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page