రంభ ఊర్వశి మేనక చేతులెత్తేస్తారు!
- Guest Writer
- Apr 2
- 2 min read

స్వర్గంలో ‘‘రంభ- ఊర్వశి- మేనక’’లను కొట్టే అందగత్తెలున్నారా? ఇంద్రుని కుమార్తెల అందచందాల సమ్మోహనానికి గురి కాని మగాడున్నాడా? .. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకుంటారు. ఇదిగో ఇక్కడ ఆ ముగ్గురిని తలదన్నే అప్సరస ప్రత్యక్షమైంది. ఒకే ఒక్క లుక్కు చాలు.. అల్ట్రా బ్యూటీ ముందు పోటీపడలేక రంభ ఊర్వశి మేనక చేతులెత్తేస్తారు. పోటీ నుంచి నిరభ్యంతరంగా తప్పుకుంటారు. భారతీయ సినీపరిశ్రమలో దశాబ్ధ కాలంగా హవా సాగిస్తున్న మొరాకో బ్యూటీ నోరా ఫతేహి దేవతా సుందరి రూపంతో కుర్రకారు గుండెల్లో నిదురిస్తోంది. మతి చెడే అందంతో కవ్వించడంలోనే కాదు.. అద్భుతమైన డ్యాన్సింగ్ ప్రతిభతో హృదయాలను గెలుచుకుంది.
నోరా సోషల్ మీడియాల్లో బోల్డ్ ఫోటోషూట్లతోను పాపులరైంది. ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ నెవ్వర్ బిఫోర్ అంటూ కితాబిచ్చేస్తోంది యూత్. ప్రఖ్యాత ‘‘బ్రైడ్స్ టుడే’’ కవర్ పేజీ కోసం నోరా ఫోజులు గుబులు రేకెత్తిస్తున్నాయి. ఈ భామ వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ నుదుటిన పాపిడిబొట్టు.. నల్లని కాటుక కళ్లు.. మెడలో వెండి హారం.. చూడగానే భారతీయ ట్రెడిషన్ ని ఎలివేట్ చేస్తుంటే, జడలో పది మూరల మల్ల చెండు సువాసనలు కుర్రకారును మత్తులోకి దించుతోంది.
కెరీర్ మ్యాటర్‌కి వస్తే...లారెన్స్ మాస్టార్ కాంచన చిత్రంలో నోరా ఫతేహి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తాజా అప్ డేట్ తెలియాల్సి ఉంది. మరోవైపు రియాలిటీ షోల జడ్జిగాను నోరా పాపులరైంది.
తుపాకి.కామ్ సౌజన్యంతో...
విజయశాంతి రేంజ్ తగ్గలేదు!

లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకొనేంత ఇమేజ్ సంపాదించుకొన్న నటి.. విజయశాంతి. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలపై ఫోకస్ తగ్గించారు. చాలా కాలం తరవాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తన ఇమేజ్‌కి తగ్గ పాత్ర పోషించారు. ఆ సినిమాలో విజయశాంతి అందుకొన్న పారితోషికం గురించి అప్పట్లో ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఇప్పుడు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం కూడా విజయశాంతి భారీ మొత్తంలో పారితోషికం అందుకొన్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లేడీ సూపర్ స్టార్‌కు రూ.3 కోట్లు ముట్టజెప్పారన్నది ఓ టాక్. రూ.3 కోట్లంటే తక్కువ మొత్తం కాదు. ఓ స్టార్ హీరోయిన్ కు ఇస్తున్న రెమ్యునరేషన్ ఇది. విజయశాంతి రేంజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఇదో నిదర్శనం.
తల్లీ కొడుకుల కథ ఇది. విజయశాంతి పాత్రని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. ‘కర్తవ్యం సినిమాలోని వైజయంతీకి ఓ కొడుకు ఉంటే ఎలా ఉంటుంది%`% అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. దాన్ని బట్టి%ౌ% విజయశాంతి పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. ఇటీవలే టీజర్ విడుదలైంది. మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా సిద్ధమైంది. ట్రైలర్ కట్ చూసిన వాళ్లు ‘కల్యాణ్ కెరీర్‌లో మరో హిట్టు గ్యారెంటీ’ అని జోస్యం చెబుతున్నారు. అంత బాగా వచ్చిందట. సాధారణంగా సినిమా విడుదలకు వారం, పది రోజుల ముందు ట్రైలర్ విడుదల చేస్తారు. కానీ మూడు వారాల ముందే ట్రైలర్ ని వదిలేయాలని భావిస్తున్నార్ట. ఈమధ్య ఓ మాస్ పాట విడుదలైంది. దానికీ మంచి స్పందనే వస్తోంది. కాస్త ప్రచారం గట్టిగా చేసుకొంటే %-% మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం వుంది.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
విక్రమ్ కష్టం వృధా పోతుందా?

క్యారెక్టర్ కోసం ఇమేజ్ లెక్కలు వేయకుండా వొళ్ళు హూనం చేసుకునే నటుడు విక్రమ్. ఆయన సినిమా ఫెయిల్ అవుతుందేమో కానీ నటుడికి ఆయన ప్రయత్నానికి ఎప్పుడూ మంచి మార్కులే పడతాయి. లేటెస్ట్ గా ‘వీరధీరశూర’ సినిమాతో వచ్చాడు విక్రమ్. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. దర్శకుడు అరుణ్ కుమార్ చాలా కొత్త ఎప్రోచ్ తో సినిమా తీశాడు. టేకింగ్ లో ఓ కొత్తదారిని చూపించిన సినిమా ఇది. క్యారెక్టర్ పరంగా కూడా విక్రమ్ కష్టాన్ని మెచ్చుకోవాలి. ఎక్కడా ఎలివేషన్ లేకుండా కాళి పాత్రలోనే కనిపించాడు. చాలా సహజంగా ఫైట్లు చేశాడు. లెన్తీ సింగిల్ షాట్స్ లో తను కనిపించిన తీరు, క్యారెక్టర్ కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తుంది.
అయితే సినిమాకి అనుకున్నంత ఫుట్ ఫాల్స్ కనిపించలేదు. సరైన ప్రమోషన్స్ లేకపోవడం ఒక కారణం అయితే, లిమిటెడ్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం మరో కారణం. అయితే సినిమా కోసం విక్రమ్ పడిన కష్టం వృధా కాదనే చెప్పాలి. ఒక యాక్షన్ సినిమాని ఇలాంటి అప్రోచ్ తో కూడా తీయొచ్చనే ఓ కొత్తదారిని సినిమా చూపించింది. మున్ముందు ఇలాంటి స్టయిల్ మేకింగ్ లో సినిమాలు వస్తే గనుక సినిమా స్వరూపంలో ఓ కొత్త ఒరవడి వస్తుందనే చెప్పాలి.
తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
Comments