top of page

వినూత్న ప్రయోగాలే జనాలకు రీచ్‌ అవుతాయి

  • Guest Writer
  • Apr 7
  • 2 min read


పటాస్‌ సినిమాతో ఒక్కో టపాసు పేల్చుకుంటూ దర్శకుడిగా సినీ వినీలాకాశంలో దూసుకుపోతున్నాడు అనిల్‌ రావిపూడి. ఇతని ఖాతాలో ఫెయిల్యూర్స్‌ కన్నా సక్సెస్‌ లే ఎక్కువగా ఉన్నాయి. సరే ఇతని సినిమా చూసినవాళ్లు బాగుందనో.. బాలేదనో రివ్యూలు రాస్తారు. అది సాధారణం. కానీ నేను రాయబోయేది అతని మూవీ మేకింగ్‌ స్టైల్‌ అండ్‌ ప్రమోషన్‌ టాస్క్‌ గురించి నిజానికి నాకు అనిల్‌ రావిపూడి లో నచ్చింది ఈ వెరైటీ ప్రమోషన్లే. సాధారణంగా ఏ దర్శకుడైనా సినిమా ప్రారంభాన్ని ఫిల్మ్‌ నగర్‌ గుళ్ళోనో .. ఇంకెక్కడో కొబ్బరికాయ కొట్టి ఆవిష్కరించుకుంటాడు. అక్కడితో నేరుగా సినిమా షూటింగులు మొదలౌతాయి. కానీ అనిల్‌ రావిపూడి రూటే సెపరేటు. సినిమా ముందు సినిమా తర్వాత కూడా మూవీని డిఫరెంట్‌ గా ప్రమోట్‌ చేయడంలో అనిల్‌ దిట్ట అయిపోయారు. ఈ మధ్య వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్‌ కూడా మూవీ టీమ్‌ తో రోజుకో సెలబ్రిటీ ఇంటికి పోయి డిఫరెంట్గా చేశాడు. నిజానికి పెయిడ్‌ యాడ్స్‌ కన్నా అనిల్‌ రావిపూడి వెరైటీగా చేసిన మూవీ ప్రమోషనే బాగా పేలింది. తాజాగా ఇప్పుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మెగా 157 బ్యానర్‌ తో ఓ సినిమా అనౌన్స్‌ చేసారు. పూజాదికాలు అయిన తర్వాత ఈ మూవీ లాంచింగ్‌ కూడా వెరైటీగా ప్లాన్‌ చేశాడు అనిల్‌. ఒక స్టూడియోలో చిరంజీవి గత సినిమాల్లోని కటౌట్లు పెట్టి వాటి పక్కన ప్రొడక్షన్‌ టీమ్‌.. రైటర్స్‌ టీమ్‌.. మ్యూజిక్‌ టీమ్‌.. ప్రొడ్యూసర్స్‌.. ఇలా అన్ని క్రాఫ్ట్స్‌ కి చెందిన వాళ్ళని నిలబెట్టి చిరంజీవితో సెల్ఫ్‌ ఇంట్రడ్యూస్‌ చేసుకునే కార్యక్రమం ప్లాన్‌ చేసి ఆఖరికి దర్శకుడిగా తనను కూడా చిరంజీవికి పరిచయం చేసుకోవడం వెరైటీ గా అనిపించింది. టీవీల్లో లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చే పబ్లిసిటీ కన్నా ఇటువంటి వినూత్న ప్రయోగాలే జనాలకు ఎక్కువగా రీచ్‌ అవుతాయి.

- పరేష్‌ తుర్లపాటి


బ్యాంకాక్‌ కొండలు కోనల్లో యువనటి గట్స్‌

పచ్చని ప్రకృతిని ఆస్వాధించే మనసుండాలే కానీ ఈ ప్రపంచంలో ఎగ్జోటిక్‌ లొకేషన్లకు కొదవేమీ లేదు. అందునా బ్యాంకాక్‌ అడవుల్లో సుదూర తీరాన పచ్చందాలను తనివి తీరా ఆస్వాధించి తీరాల్సిందే. అక్కడ కొండలు కోనలు గుట్టలు నదీ సముద్ర జలాల్లో విహరిస్తే కలిగే మజానే వేరు! ప్రస్తుతం అలాంటి అద్భుతమైన విహారయాత్రను ఆస్వాధిస్తోంది మెహ్రీన్‌ ఫీర్జదా.

తాజాగా కొండల మధ్య పచ్చని జలాల్లో బోట్‌ షికార్‌ చేస్తూ కనిపించింది. ఎత్తైన పర్వతాల నడుమ పచ్చని నీడ ఆ నది నీటిలో ప్రతిబింబిస్తోంది. అలాంటి చోట మెహ్రీన్‌ తనను తాను మర్చిపోయి ఇదిగో ఇలా ఫోజులిచ్చింది. హాఫ్‌ షోల్డర్‌ ఫ్రాక్‌ లో థై అందాలను కూడా ప్రదర్శిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం మెహ్రీన్‌ ఫోటోషూట్‌ అంతర్జాలంలో వైరల్‌గా మారుతోంది.

చేతిలో సినిమాల్లేవ్‌. కావాల్సినంత తీరిక సమయం ఉంది. దానిని ఇలా సద్వినియోగం చేస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా ట్రావెల్‌ మ్యాగజైన్‌ షూట్‌ కోసం అక్కడికి వెళ్లిందా? అని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఇలియానా ఫిజీ దీవికి ఇదే తరహాలో ప్రచారం కల్పించింది. ఇప్పుడు మెహ్రీన్‌ బ్యాంకాక్‌ అందాలను ప్రమోట్‌ చేయబోతోందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అన్నిటికీ మెహ్రీన్‌ స్వయంగా స్పందించాల్సి ఉంటుంది. ఎఫ్‌ 2 ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత మెహ్రీన్‌కి సరైన ఆఫర్‌ లేదు. మునుముందు ప్రయత్న లోపం లేకుండా ఏదైనా మాయాజాలం సృష్టిస్తుందేమో చూడాలి.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page