వ్యవ‘సాయం’ తీరు మారాల్సిందే!
- DV RAMANA
- Apr 2
- 2 min read

రసాయనిక ఎరువుల వాడకం రైతుల ఆర్థిక స్థితిని, పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, పత్తి, చెరకు, ఇతర వాణిజ్య పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం అనివార్యంగా మారిందని రైతులు అంటున్నారు. కానీ దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నారు. పెట్టుబడులు పెరిగి అప్పుల్లో కూరుకుపోవడం, అనారోగ్యాలకు గురికావడం, భూసారం క్షీణిం చడం వంటి అనర్థాలు జరుగుతున్నాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రసాయనిక ఎరువులను అధికంగా వాడటం వల్ల భూమిలో సూక్ష్మజీవులు నశించి దీర్ఘకాలంలో దిగుబడులు తగ్గిపోతాయి. పైగా ఈ ఎరువుల ధరలు ఎక్కువ కావడంతో అప్పులుచేయాల్సి వస్తోంది. వాటిని తీర్చలేని స్థితిలో ఒత్తిడి పెరిగి పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2022 జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం రాష్ట్రంలో 917 మంది రైతులు అప్పుల భారం తోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నా ఇప్పటికీ ఆ పరిస్థితి ఉంది. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, విశాఖపట్నం వంటి ఏడు జిల్లాల్లో రసా యనిక ఎరువుల వాడకం జాతీయ సగటు (90 కిలోలు/హెక్టారు) కంటే ఎక్కువగా (138 కిలోలు/ హెక్టారు) ఉంది. ఈ జిల్లాల్లో వరి, చెరకు, పత్తి వంటి అధిక దిగుబడి పంటలు ఎక్కువగా పండిస్తు న్నారు. ఈ పంటలకు ఎక్కువ పోషకాలు అవసరం కావడంతో రసాయనిక ఎరువులపై ఆధారపడతు న్నారు. గోదావరి, కృష్ణా నదీతీర ప్రాంతాల్లో నీటి పారుదల సౌకర్యం ఉండటంతో ఏటా మూడు పంట లు పండిస్తారు. ఆ మేరకు ఎరువులు, పురుగు మందుల వినియోగమూ ఎక్కువవుతుంది. సమతుల్య ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన లేకపోవడం దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. రాష్ట్రంలో 2024-25లో ఎరువుల వినియోగం 2023-24 ఏడాదిలోని దేశ సగటు కంటే 82 శాతం అధికంగా నమోదైంది. దేశంలో ఎకరాకు సగటున 56 కిలోల రసాయన ఎరువులు వాడుతుంటే ఏపీలో మాత్రం 102 కిలోలు వాడుతున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు సరైన సమాచారం అందకపోవడమే దీనికి కారణం. అలాగూ రసాయనిక ఎరువులతో తక్షణ దిగుబడి లభిస్తుంటే ప్రకృతి వ్యవసాయంలో ఫలితాలు కనిపించడానికి సమయం పడుతుంది. సేంద్రియ ఉత్పత్తులకు సరైన మార్కెట్, ధరలు లేకపో వడం కూడా కారణంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదు కావడం రసాయనిక వ్యవసాయ విధానాల వైఫల్యాన్ని సూచిస్తోంది. రసాయన ఎరువుల వల్ల నీటి, వాయు కాలు ష్యం పెరిగి రైతు కుటుంబాలు అనారోగ్యం పాలవుతున్నాయి. పండిరచిన పంటను నిల్వ చేసుకునే అవ కాశాలు అందుబాటులో లేవు. మార్కెటింగ్ సౌకర్యం కూడా అంతంత మాత్రమే. పంటకు తెగుళ్లు సోక డాన్ని కూడా ప్రకృతి విపత్తుగా ప్రభుత్వం గుర్తించి పరిహారం ఇవ్వాల్సి ఉంది. ప్రకృతి వైపరీత్యాల్లో నష్ట పోయిన పంటకు పూర్తిగా పరిహారం అందించాలి. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నా వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేవు. పెట్టబడి సాయం కూడా అందడం లేదు. కౌలు దారుల్లో ఎక్కువ మంది సామాజికంగా వెనుకబడిన వారే. అప్పుల కారణంగా కుటుంబాల్లోనూ గొడవలు రేగి ఆత్మహత్య లకు కారణం అవుతున్నాయి. గతంలో పశువుల మేత కోసం గడ్డిని పశువుల యజమానులు కొను గోలు చేసేవారు. ప్రస్తుతం మిషన్ ద్వారా వరి కోత కోయించడంతో గడ్డి పనికి రాకుండా పోతోంది. ఏపీలో రైతు సంఘాల లెక్కల ప్రకారం 1.20 కోట్ల మంది రైతులు ఉన్నారు. కేవలం దేవాలయ భూములు కౌలుకు చేసే రైతులే 16.50 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, విద్యుత్‌పై సబ్సిడీలు ఇస్తోంది. అయితే ఎరువుల సబ్సిడీలు కంపెనీలకే ప్రయోజనకరంగా ఉంటున్నాయి. రైతులకు స్థిరమైన ఆదాయం, మద్దతు ధరల హామీ అవసరం. సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వం మరింత శిక్షణ, ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతుల అప్పుల బాధలు తీరాలంటే పశుపోషణ, హార్టీకల్చర్ వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ప్రోత్సహించాలి. అధిక వడ్డీరేట్లతో కూడిన అనధికారిక రుణదాతలపై నియంత్రణ కఠినతరం చేసి, బ్యాంకుల ద్వారా సులభ రుణాలు అందుబాటులోకి తేవాల్సి ఉంటుది. పంట భీమా పథకాలు సక్రమంగా అమలు చేయాల్సి ఉంది.
Comments