విశాఖలో సిక్కోలు యువకుడు మృతి
- ADMIN
- Dec 17, 2024
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నగరానికి చెందిన బెవర హిమఆదిత్య శ్రీరామ్ (21) అనే యువకుడు విశాఖపట్నం కేర్ ఆసుపత్రి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం రాత్రి 2.40 గంటలకు దుర్మరణంపాలయ్యాడు. నగరంలో బెవర శ్రీరాములు టింబర్ డిపో యజమాని శ్రీరాములు పెద్ద కొడుకు ప్రకాశ్ పెద్ద కుమారుడు ఆదిత్య బీటెక్ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం ఆర్‌ఆర్‌బి పరీక్ష రాసేందుకు విశాఖపట్నం వచ్చాడు. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి ఎన్‌ఫీల్డ్ బైక్ మీద కేర్ ఆసుపత్రి రోడ్డులో వెళ్తుండగా స్పీడ్‌బ్రేకర్‌ను గుర్తించకపోవడంతో రోడ్డుప్రమాదం జరిగి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన కుటుంబ సభ్యులు విశాఖ ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రికి ఆదిత్య నేత్రాలు దానంచేశారు.
留言