top of page

స్పందన లేని తోపులకు వందనం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 11 hours ago
  • 2 min read


పాకిస్తాన్‌ ముర్దాబాద్‌.. ఇప్పుడు భారత్‌లో మిన్నంటుతున్న నినాదం ఇదే. ముస్లింలు కూడా పాక్‌ను తెగడుతూ ఎన్నడూ లేని దేశభక్తి ప్రదర్శిస్తున్నారు. ఆ మతానికి ప్రతినిధిగా చెప్పుకొనే ఆసదుద్దీన్‌ ఒవైసీ, ముస్లింల రక్షకురాలిగా ప్రకటించుకునే కాంగ్రెస్‌ కూడా మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంతోపాటే మేము అని అంటున్నారు. కమ్యూనిస్ట్‌, బీఆర్‌ఎస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకేలు తప్ప దేశంలోని మిగతా పార్టీలన్నీ పహల్‌గాం ఉగ్రదాడిని ఖండిరచాయి. కేంద్రం చర్యలకు అండగా ఉంటామని ప్రకటించాయి. ఇదంతా బీజేపీ, మోదీ, అమిత్‌ షాల విజయం కాదు.. భారతీయులందరి విజయం. ఇదే ఐక్యతను కొనసాగిస్తే గత 75 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉన్నత భారతం సాధ్యమే. దేశ రాజకీయాలను మార్చే ఆలోచనతో కేసీఆర్‌ తన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. రాజకీయాలే కాదు దేశా భివృద్ధికి తనవద్ద సృష్టమైన ఆలోచనలు ఉన్నాయని చెబుతూ ముఖ్యమంత్రి హోదాలో ఆయన తమిళనాడు, పంజాబ్‌, బీహార్‌, ఢల్లీి తదితర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పార్టీలకు తన అజెండాను వివరించారు. దేశంలో నీటి వనరులను ఏ విధంగా వాడుకోవాలో, రైతుల సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో తమ బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే తెలుసనీ, అంచేత కేంద్రంలో ఉన్న బీజేపీని ఓడిరచి బీఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. పంజాబ్‌ వెళ్లి రైతులకు ఆర్ధిక సాయం చెక్కులు కూడా పంపిణీ చేశారు. ఇంతవరకు దేశం మీద బీఆర్‌ఎస్‌ కన్సర్న్‌ బాగుంది. అందులో డౌటే లేదు. కానీ నిజంగా దేశం పట్ల నిబద్ధత ఉంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్‌ ఏం చెయ్యాలి? దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత ఎవరైనా ఆయన నుంచి దేశంలో జరుగుతున్న పరిణా మాల పట్ల స్పందన ఆశిస్తారు. కానీ పహల్గాం దుర్ఘటనలో కేసీఆర్‌ స్పందించిన దాఖలాలే లేవు. ప్రస్తుతం వరంగల్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ సభ ఏర్పాట్లపై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదో వంతు పహల్గాం మృతుల పట్ల చూపించి పార్టీ తరపున నివాళులు అర్పించి ఉండా ల్సింది. అదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నెక్లెస్‌ రోడ్లో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళులు అర్పించారు. చివరికి ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ కూడా ర్యాలీలో పాల్గొని సంఫీుభావం తెలిపారు. కానీ ఏరీ మన సెలబ్రిటీలు.. వీర తోపులు. వారికంటే అనన్య నాగళ్ల వంద రెట్లు మేలు. ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా అన్న నినాదం గుర్తుండే ఉంటుంది. ఇజ్రాయిల్‌ భీకర దాడులకు గురైన గాజా స్ట్రిప్‌లోని ఓ ప్రాంతానికి మద్దతుగా ఇండియన్‌ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఓ పోస్టర్‌ షేర్‌ చేశారు. అదీ ఏఐ ద్వారా సృష్టించిన ఇమేజ్‌. కానీ పహల్గాం పైశాచిక దుశ్చర్య మీద స్పందిం చరేం..? భయం.. వణుకు.. ఎక్కడో ఉన్న రఫా మీద ఉన్న ప్రేమ మన పహల్గాం.. మన ఇండి యన్ల మీద లేదెందుకు..? అనన్య నాగళ్లను చూసి మిగతా సెలబ్రిటీలు, పెద్ద పెద్ద తోపు హీరోలు, హీరోయిన్లు సిగ్గుతో తలదించుకోవాలి. అనన్య ఒక ఈవెంట్‌ కోసం నెల్లూరు వెళ్లింది. పహల్‌గామ్‌ ఉగ్ర దాడిలో మరణించిన ఓ వ్యక్తిది ఆ పక్కనే ఉన్న కావలి అని తెలిసి నేరుగా అక్కడికి వెళ్లి నివాళులర్పించింది. థియేటర్లకు వెళ్లి తొక్కిసలాటలకు, మరణాలకు కారకులైనవారు, సరోగేట్‌ యాడ్స్‌, బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసి కోట్లు కొల్లగొట్టేవారు సిగ్గుపడాలి. అనన్య ముందు వారంత దిగ దుడుపే. (స్పందించిన చిరంజీవి వంటి ఒకరిద్దరు హీరోలకు ఈ వ్యాఖ్యల నుంచి మినహా యింపు,..) విజయవాడ మునిగిపోతే.. కశ్మీర్లో తెలుగువాడు ఉగ్రవాదుల చేతుల్లో మరణిస్తే అనన్య నాగళ్ల స్పందిస్తుంది! కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ఆమెకు పెద్దగా చాన్సులు ఇవ్వరు. అమెరికాలో ఉండే ఓ పాకిస్తానీ మిలిటరీ లింకులున్న కరాచీ లేడీకి పల్లకీ మోయడం మన నిర్మాతలకే చెల్లింది. ఇక్కడ మరొకరిని కూడా గుర్తు చేసుకోవాలి. కరోనా కాలంలో ఇళ్లలోనే ఉండి పెసరట్లు, ఆమ్లెట్లు పోస్తూ ఆ వెగటు ఫోటోలను మీడియాలో పెట్టుకుని ప్రచారం పొందిన తోపులకన్నా ఓ చిన్న నటి ప్రణీత సుభాష్‌ రోజూ వందల మందికి ఫుడ్‌ సప్లయ్‌ చేయడం ద్వారా ఉదారత చాటుకుంది. ఆమెను చూసైనా మన తోపులు సిగ్గు తెచ్చుకోవడంలేదు. ఒకడిని మించి మరొకడు తిక్క వీడియో లు పెట్టి మురిసిపోయారు.. సంపాదనే కాదు.. కాస్త స్పందించే గుణం సంపాదించండి!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page