సుమ.. మనం చదవాల్సిన సిలబస్
- Guest Writer
- Mar 24
- 2 min read

చాలా ఏళ్ళ క్రితం టీవీలో ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తుంటే తెలుగమ్మాయి కాకపోయినా...
అటజనికాంచే పద్యం అల్లసాని పెద్దన రాసినది అనుకుంటున్నా నేను.. గుర్తులేదు. మా రోజుల్లో ఇదొక టంగ్‌ట్విస్టర్. ఈ పద్యాన్ని కంఠస్థం పట్టినట్టు ఉంది చక్కగా చెప్పేసింది.
తర్వాత లక్ష్మీ మంచు చేసిన ఇంటర్వ్యూలో అనుకుంటా.. ఏ ఛానల్‌లో చూసినా నువ్వే కనిపిస్తున్నావ్ అని అడగ్గానే.. అంటే డిస్కవరీ ఛానల్‌లో కూడానా అని తన మీద తనే జోక్ వేసుకుంది ఈ అమ్మాయి.. తనే పాపులర్ సుమ.
నాగార్జునకి, నాకూ వయసు ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఆగిపోయింది.. అంటూనే పెద్దవారితో వాళ్ళకి తగినట్టు ప్రవర్తిస్తుంది. యూత్ కంగారుపడేలా వాళ్ళతో కలిసిపోయి అల్లరి చేస్తుంది.
మన దేశంలో పెళ్ళైన ఆడవాళ్ళు కెరీర్‌లో ఊహించని స్థాయికి వెళ్ళాలి అంటే చాలా చాలా కష్టం. అది సుమ ఎలా బ్యాలన్స్ చేసుకుంటుందో కానీ నిజంగా గ్రేట్. ఈనాడు లాంటి సంస్థ ప్రతీ ఆదివారం వచ్చే ఈనాడు అనుబంధం బుక్ కవర్‌స్టోరీ కోసం మహా కసరత్తు చేసి ప్రచురిస్తుంది. అలాంటి ఈనాడు కూడా సుమ మీద కవర్ స్టోరీగా బుక్‌లో రెండు పేజీలు కేటాయించింది ఆమధ్యన. ఒక రోజులో, ఒక సంవత్సరంలో సుమ సాధించిన విజయం కాదు, ఏళ్ల తరబడి ఇక్కడ ఉంటూ అవగాహన పెంచుకుని, కరెంట్ అఫైర్స్‌ను ఫాలో అవుతూ, ట్రెండ్‌కి తగినట్టు అప్డేట్ అవుతుంది. గొంతు సవరించుకుని చకచక ప్రోగ్రాంను నడిపించడంలో తన స్టైల్ వేరంతే.. చాలా విమర్శలు వస్తున్న వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లడం తనకి ఈ గుర్తింపు ఇచ్చిన కెరీర్‌ను గౌరవించడం అంతే.. ఎవరూ వందశాతం పెర్ఫెక్ట్‌గా అవతలి వారికి నచ్చేలా ఉండలేరు. అలాగే చిన్నచిన్న పొరపాట్లు చేయడం కూడా జరుగుతుంది. అలాంటివి ఓవర్ కం చేస్తే ఇబ్బంది లేదు. సుమ కూడా మీడియా వ్యక్తి కాబట్టి కొన్ని కొన్ని లైటర్ వెయిన్‌లో తీసుకోకూడదు అనిపిస్తుంది. అప్పుడప్పుడు తను ట్రోల్ అయినప్పుడు ఇలా అనిపించింది అంతే తప్ప సుమకి చెప్పే స్థాయిలో నేను లేను.
కానీ ఒక గోల్ అనుకుని అది రీచ్ అవడానికి తపన పడి కృషి చేసి, చేస్తూ సేమ్ స్థితిలో సస్టైన్ అయి కొన్నాళ్లపాటు ఆ లెగసీనీ కాపాడుకుంటూ, నిలబెట్టుకుంటూ ఉండటం మాత్రం చాలా కష్టమైన పని.
అది సుమ చేస్తుండటం ఇన్‌స్పైర్ అయ్యే విషయం కచ్చితంగా. తన ప్రెజెన్స్, తన బిజీ షెడ్యూల్స్ చూసి అసూయపడటం కంటే తనెలా సాధించింది అనేది నేర్చుకుంటే బెటర్ కదా.
నాకు సుమ దగ్గర బాగా నచ్చే విషయం... తను చెప్పిందే. కోడి నిద్ర లేచినప్పుడు లేస్తా అది కొక్కరకో అంటుంది.. నేను అనను అంతే.. మళ్ళీ ఊరంతా నిద్రపోయేదాకా పనిచేస్తా.. పనిలోనే విశ్రాంతి.. పనిలోనే సరదా.. అని. విశ్రాంతి అంటే పని ఆపి తీసుకునేది. ఈ అర్థం తనెలా తీసుకుందో చూసి ఆశ్చర్యపడటం నావంతు అయ్యింది. స్ట్రిక్ట్‌గా ఒకటి మాత్రం చెప్తా.. యాంకర్ కావాలి అనుకునేవారికి సుమ కచ్చితంగా స్కిప్ చేయకుండా చదవాల్సిన ఒక సిలబస్.
ఫేస్‌బుక్ నుంచి సేకరణ..
Comments