top of page

‘సత్యం’ కథనాన్ని ట్వీట్‌ చేసిన లోకేష్‌

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Feb 15
  • 1 min read


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శుక్రవారం ‘సత్యం’ పత్రికలో వచ్చిన ‘అచ్చెన్న ఆదేశాల ఫైల్‌ మాయం’ కథనంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు ‘సత్యం’ కథనాన్ని ట్వీట్‌ చేసి తక్షణమే స్పందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమవుతున్న బీసీ భవనంలో బీసీ స్డడీ సర్కిల్‌ ఏర్పాటుకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ అనురాధ మోకాలడ్డుతున్నారని బీసీ సంఘాలు, విద్యార్ధులు చేస్తున్న ఆందోళనపై ‘సత్యం’ ప్రధానంగా ప్రస్తావించింది. ‘సత్యం’ కథనాన్ని చదవిన మంత్రి లోకేష్‌ బీసీ స్టడీ సర్కిల్‌ వల్ల కోచింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి సవితకు సూచించారు. బీసీ స్టడీ సర్కిల్‌కు సంబంధించిన అంశాన్ని పరిశీలించి స్పందించాలని మంత్రి సవితకు మంత్రి లోకేష్‌ ట్వీట్‌ ద్వారా సూచించారు.

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page